BigTV English

Charminar Fire Accident: ఆ మెట్ల మార్గమే 17 మంది ప్రాణాలు తీసిందా? చార్మినార్‌ బిల్డింగ్‌ ప్రమాదం వెనుక కొత్త కోణాలు

Charminar Fire Accident: ఆ మెట్ల మార్గమే 17 మంది ప్రాణాలు తీసిందా? చార్మినార్‌ బిల్డింగ్‌ ప్రమాదం వెనుక కొత్త కోణాలు

Charminar Fire Accident: హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో ఉండే అనేక నివాస సముదాయాలు ఇరుకు ఇరుకుగా ఉంటాయి. నిజాం కాలంలో నిర్మించిన అటువంటి భవనాలకు గాలి రాదు. వెలుతురూ ఉండదు. ఏ ఇంటికీ సెట్‌ బ్యాక్‌లు ఉండవు. రెండు పక్కపక్క భవనాలకు ఒకటే గోడ ఉంటుంది. ఏ భవనానికీ రెండు వైపులా కిటికీలుండవు. ఒకే భవనంలో ముందు వైపు షెట్టర్లతో షాపు, దానికి వెనుక, పైన నివాస సముదాయాలు ఉంటాయి.


ఇలాంటి చోట అగ్ని ప్రమాదాలు జరిగితే.. తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే నిన్న గుల్జార్‌హౌస్‌ చౌరస్తాలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్. గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 17మంది మృతిచెందడం అందరినీ కలచివేసింది. ప్రమాదంలో చనిపోయిన 17 మందిలో నలుగురు పురుషులు, ఐదుగురు మహిళలు, 8 మంది చిన్నారులు ఉన్నారు. మొత్తం 70 ఫైర్ సిబ్బంది, 17 మంది అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

పాతబస్తీలో ఇటువంటి ఇరుకు ఇరుకు నివాస సముదాయాలు చాలా ఎక్కువుగా ఉన్నాయి. ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదాలు జరిగితే సహాయం చేయడానికి కూడా ఇబ్బంది తలెత్తే పరిస్థితులు నెలకొన్నిఉన్నాయి. గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే రంగంలో దిగిన అగ్నిమాపక దళం సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని వెళ్లేందుకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అడ్డంకులను అధిగమించి ప్రమాద స్థలం చేరేలోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థల పరిసరాలు కూడా సాయం చేసేందుకు అనువుగా లేకపోవడం ప్రమాద తీవ్రతను పెంచింది. ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రంగా పొగకమ్మేయడంతో సహాయక సిబ్బంది టార్చిలెట్లు వాడాల్సి వచ్చింది.


మేడ్చల్‌ జిల్లా చర్లపల్లిలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వద్ద డ్రైవర్, అగ్నిమాపక దళం సకాలంలో స్పందించడంతో ముప్పు తప్పింది. ప్రమాదవశాత్తు పెట్రోల్‌ ట్యాంకర్‌కు మంటలు  అంటుకోవడంతో.. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ ట్యాంకర్‌ను నిలిపివేశాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో పెట్రోల్‌ ట్యాంకర్‌, గ్యాస్‌ ట్యాంకర్లకు కూడా మంటలు అంటుకున్నాయి. సంఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

కాగా నిన్న వరుస అగ్ని ప్రమాదాలతో హైదరాబాద్ హడలెత్తిపోయింది. ఉదయం చార్మినార్ దగ్గర గుల్జార్‌హౌజ్‌లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు.. మధ్యాహ్నం మైలార్దేవ్ పల్లిలో మూడంతస్తుల భవనంలో మరో అగ్ని ప్రమాదం.. సాయంత్రమే చర్లపల్లిలో పెట్రోల్ బంక్ లో ఫైర్ యాక్సిడెంట్.. ఇలా ఆదివారం మొత్తం వరుస అగ్ని ప్రమాదాలతో హైదరాబాద్ ప్రజలు బెంబేలెత్తిపోయారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొన్న లారీ.. ముగ్గురు మృతి

మైలార్‌దేవ్‌పల్లి ఉడంగడ్డ మొఘల్స్ కాలనీలోని జీ+త్రీ బిల్డింగ్​లో మొత్తం 12 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆదివారం సెకండ్ ​ఫ్లోర్ ​మెట్ల మార్గంలోని కరెంట్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. చుట్టుపక్కలకు వ్యాపించడంతో రెండు, మూడు అంతస్తుల్లోని జనమంతా టెర్రస్​ మీదకు పరుగులు తీశారు. కిందకు వెళ్లే మెట్ల మార్గంలో మంటలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో అంతా టెర్రస్‌పైకి వెళ్లారు. ఫస్ట్​ ఫ్లోర్ లోని వారంతా భయంతో కిందకు పరుగులు తీశారు. బండ్లగూడ ఫైర్ స్టేషన్ నుంచి మూడు ఫైరింజిన్లతో అక్కడి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. టెర్రస్‌పై ఉన్న 53 మందిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు.

అయితే అగ్నిప్రమాదం నుంచి 53 మందిని సేఫ్‌‌గా ఎలా కాపాడగలిగారు?..అక్కడి పరిస్థితులు ఎలా కలిసొచ్చాయి?..ప్రాణాలతో బయటకు తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది చేసిన వ్యూహాం ఏంటి?

Related News

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Big Stories

×