BigTV English

Brahmamudi Serial Today May 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను గదిలోకి పంపిన రుద్రాణి – గదిలో ఫోటో చూసిన రాజ్‌   

Brahmamudi Serial Today May 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను గదిలోకి పంపిన రుద్రాణి – గదిలో ఫోటో చూసిన రాజ్‌   

Brahmamudi serial today Episode: కావ్య తనతో ప్రేమగా ఉండటం లేదని రాజ్‌ వెళ్లిపోతానని బెట్టు చేస్తాడు. దీంతో ఇందిరాదేవి రాజ్‌ను ఆపేసి కావ్య తన ప్రవర్తన మార్చుకుంటుందిలే అని చెప్తుంది. ఇంతలో అందరూ కలిసి టిఫిన్‌ చేయాలనుకుంటారు.. కావ్య మాత్రం నేను ఏ టిఫిన్‌ చేయలేదు అని చెప్తుంది. అయితే నేను టిఫిన్‌ చేస్తాను అంటాడు రాజ్‌. నువ్వు చేస్తే.. ఎవరైనా తింటారా ఇక్కడ అంటూ వెటకారంగా మాట్లాడుతుంది కావ్య.. అయితే నేను దోశలు వేసి నీచేత తినిపించి నువ్వు సూపర్‌ అనేలా చేస్తాను చూడు అంటూ అపర్ణ, ఇంద్రాదేవిలను తీసుకుని కిచెన్‌లోకి వెళ్తాడు రాజ్‌. అక్కడ దోశ పిండి ఎక్కడ ఉందో.. ఆ పిండి ఎలా వేస్తే దోశలు వస్తాయో కాస్త ఇన్మఫర్మేషన్‌ ఇవ్వండి నాకు అంటూ అడగ్గానే.. అపర్ణ, ఇంద్రాదేవి షాక్‌ అవుతారు.


ఇంతలో అపర్ణ అనుకున్నా ఈ మధ్య కాలంలో దోశలు వేయడం నువ్వెప్పుడు నేర్చుకున్నావా.? అంటుంది. దీంతో రాజ్‌ నాకు దోశలు వేయడం రాదని మీకెలా తెలుసు..? అని అడుగుతాడు. అది ఈ కాలం అబ్బాయిలు వంట నేర్చుకోవడం లేదు కదా.. అలా గెస్‌ చేశాను అంటుంది. అయితే మీరు తనను ఇంప్రెస్‌ చేయమని అడిగారు చేయడానికి ఒప్పుకున్నాను మీరు ఏం చేస్తారో నాకు తెలియదు దోశలు వేయడం మీరే నేర్పాలి అంటాడు. దీంతో ఇంద్రాదేవి ఈ గొడవంతా ఎందుకు మేము దోశలేస్తాం.. నువ్వు వేసినట్టుగా వెళ్లి కలరింగ్‌ ఇచ్చేయ్‌ అని చెప్తుంది. దీంతో రాజ్‌ నో కాంప్రమైంజ్‌ లవ్‌లోనూ వార్‌లోనూ చీటింగ్ అసలు ఉండకూడదు అంటాడు.   అయితే ముందు ఒక దోశ వేసి చూపిస్తాను తర్వాత నువ్వు వేయు అని అపర్ణ దోశ వేసి చూపిస్తుంది. తర్వాత రాజ్‌ దోశలు వేసి డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు తీసుకెళ్తాడు. దోశలు చూసిన ప్రకాష్‌ చూడటానికి చాలా బాగున్నాయి అంటాడు. తింటే ఇంకా బాగుంటాయి బాబాయ్‌ అని రాజ్‌ చెప్తాడు. అదేంటి అని స్వప్న అడగ్గానే. రాజ్‌ చట్నీ అని చెప్తాడు. ఏం చట్నీ అంటుంది. టమోట కచప్‌ చట్నీ ఇని చెప్పగానే.. కళ్యాణ్‌ నాకు ఆకలిగా లేదు నేను వెళ్తాను అంటాడు.

రాజ్‌ కోపంగా ఏయ్‌ ఎక్కడికి వెళ్లేది.. తినాల్సిందే.. అంటూ అందరికీ వడ్డిస్తాడు. అందరూ అనుమానంగా చూస్తుంటారు. ఇంకా ఏంటి అలా చూస్తున్నారు.. తినేయండి అని రాజ్‌ చెప్పగానే.. అపర్ణ బాబేదో చట్నీ అంటున్నాడు పైగా తినాలని రూల్‌ పెట్టాడు.. అటుంటే. చేసింది తినడానికే కదా నాన్న అని రాజ్‌ అంటాడు. దీంతో సుభాష్‌ అదేరా మీ అమ్మతో ముండు జాగ్రత్తగా చెప్తున్నాను. అపర్ణ నా బ్యాంకు అకౌంట్‌కు సబంధించింది అంతా నా డైరీలో ఉంది. లాకర్‌ సంబంధించిన తాళాలన్నీ బీరువాలో ఉన్నాయి. అని చెప్తుంటే అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు నాన్నా.. అని రాజ్‌ అడుగుతే.. తిన్నాక చెప్పలేరని అంటుంది కావ్య.. దీంతో రాజ్‌ హలో మేడం..  అంత వెటకారం ఏమోద్దు.. తిన్నాక మీరే  మీ డిసీజన్‌ మార్చుకుంటారు. తినండి అని రాజ్‌ చెప్పగానే..ప్రకాష్‌ తింటాడు..


ధాన్యలక్ష్మీ ఎలా ఉందండి అని అడుగుతుంది. అద్బుతంగా ఉంటుంది అని రాజ్‌ చెప్తాడు. ఇంతలో స్వప్న చట్నీ ఏంటి తియ్యగా కారంగా ఇలా ఉంది అంటుంది. కదా అదే మ్యాజిక్కు ఎలా ఉందో తెలిసే లోపు గొంతులోంచి పోతుంది అని రాజ్‌ చెప్పగానే.. ఏంటి పోయేది ప్రాణమా..? అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతలో అందరూ తిని అద్బుతం.. అమోఘం అంటూ మెచ్చుకోగానే కావ్య అందరినీ తిడుతుంది..ఏంటి అమోఘం నిజం చెప్పడానికి ఎంతకంత మెహమాటం అంటుంది. దీంతో రాజ్‌ అందరికీ నచ్చిందని నీకు కుళ్లుగా ఉంది కావాలంటే మీరు చెసిన చట్నీతో ఒక్క దోశ పూర్తిగా తినండి అప్పుడు ఒప్పుకుంటాను అంటుంది. దోశ టేస్ట్‌ చూసిన రాజ్‌ ముఖం అదోలా పెట్టగానే ఒక్కోక్కరుగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోతారు.

తర్వాత రుద్రాణి తన రూంలో కూర్చుని కావ్య, రాజ్‌ పెళ్లి ఫోటో పట్టుకుని ఈ రోజుతో నువ్వు ఆడుతున్న డ్రామాలన్నీ బయట పెడతాను చూడు.. రాజ్‌ నిన్ను అసహ్యించుకునేలా చేస్తాను అనుకుంటూ ఫోటో మధ్యలోకి కట్ చేసి రాజ్‌ ఫోటో దాచిపెట్టి.. కావ్య ఫోటో మాత్రం బెడ్‌ మీద పెడుతుంది. రాజ్‌ లోపలికి రాగానే ఈ ఫోటో చూసి షాక్‌ అవ్వాలి అనుకుంటూ కిందకు వెళ్తుంది. హాల్లో రాజ్‌ అలసిపోయి కూర్చుని ఉంటే.. రుద్రాణి వెళ్లి  నా గదిలో నీకోసం ఫుల్ ఏసి వేసి గది మొత్తం కూల్‌ గా పెట్టాను వెళ్లి రెస్ట్‌ తీసుకో అని చెప్తుంది. సరేనని రాజ్‌ రూంలోకి వెళ్లి అక్కడ ఫోటో చూసి బయటకు వచ్చి రుద్రాణిని తిట్టి వెళ్లిపోతాడు. దీంతో రుద్రాణి ఏమైంది అనుకుంటూ రూంలోకి వెళ్లి  ఫోటో చూస్తుంది. అక్కడ స్వప్న ఫోటో ఉంటుంది. ఇంతలో స్వప్న వచ్చి ఏంటత్తా ఇది నా ఫోన్‌లో ఉండే నా ఫోటోస్‌ ఇక్కడికి ఎలా వచ్చాయి.. అంటూ అడుగుతూ తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×