Hyderabad Metro: హైదరాబాద్ నగర వాసులకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం కానుకగా గుడ్ న్యూస్ చెప్పారు. మెట్రో విస్తరణ పై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనితో నగరవాసులకు మెట్రో సేవలు మరింతగా విస్తృతం కానున్నాయి.
హైదరాబాద్ నగరంలో మెట్రో అందిస్తున్న సేవలు అమోఘం. రవాణా వ్యవస్థలో నగరానికి సంబంధించి మెట్రో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే మూడు మార్గాల ద్వారా నగరంలో మెట్రో సేవలు కొనసాగుతుండగా, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మెట్రో సేవలకు ప్రాధాన్యత పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం, ఆ సేవలను మరింతగా పెంచేందుకు దృష్టి సారించింది.
తాజాగా శామీర్ పేట్, మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. జేబీఎస్ నుండి శామీర్ పెట్ వరకు గల 22 కిలోమీటర్లు, ప్యారడైజ్ నుండి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల మెట్రో మార్గానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెట్రో రైల్ ఫేజ్ – 2 బి భాగంగా డీపీఆర్ తయారు చేయాలని సీఎం మెట్రో అధికారులకు ఆదేశాలిచ్చారు. సీఎం తీసుకున్న నిర్ణయం పై మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Liquor sales in telugu States: న్యూ ఇయర్ ఫస్ట్ రోజే.. రికార్డ్ బద్దలు కొట్టిన మద్యం ప్రియులు..
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రెండవ దశ మెట్రో రైల్ మార్గాలను నిర్మించేందుకు మెట్రో సిద్ధమైంది. ఈ దశలో మేడ్చల్ వరకు కూడా మెట్రో మార్గాన్ని పెంచాలని సీఎం నిర్ణయం తీసుకోవడం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో ప్రయాణికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..
శామీర్ పెట్, మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను విస్తరించాలని నిర్ణయం
జేబీఎస్ నుండి శామీర్ పెట్ (22 కిలోమీటర్లు) , ప్యారడైజ్ నుండి మేడ్చల్ (23 కిలోమీటర్లు) వరకు మెట్రో మార్గానికి మెట్రో రైల్ ఫేజ్ -2 'బి' లో… pic.twitter.com/ZK1DwMC9l6
— BIG TV Breaking News (@bigtvtelugu) January 1, 2025