BigTV English

Tollywood: మళ్లీ తల్లి కాబోతున్న బ్యూటీ.. కొత్త ఏడాది.. కొత్త శుభవార్తతో వీడియో షేర్..!

Tollywood: మళ్లీ తల్లి కాబోతున్న బ్యూటీ.. కొత్త ఏడాది.. కొత్త శుభవార్తతో వీడియో షేర్..!

Tollywood:ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా (Ileana) తాజాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులకు మరో శుభవార్తను తెలిపింది. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు తన భర్త, కొడుకుతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి తల్లి కాబోతున్నట్లు ఒక వీడియోని పంచుకుంది. ఇలియానా దూకుడు చూస్తుంటే మరీ ఫాస్ట్ గురూ అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.


కొత్త సినిమాతో స్టార్ స్టేటస్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది ఇలియానా. ‘దేవదాస్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె కుర్రకారు ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది. ముఖ్యంగా మెరుపుతీగ లాంటి నడుముతో అందరిని ఆకట్టుకుంది. ఇక ఏ సినిమాలో అయినా ఈమె నటిస్తోందంటే ఆ సినిమా డైరెక్టర్ ఎక్కువగా ఈమె నడుము పైన ఫోకస్ చేసేవారు. అంతేకాదు ఈ విషయంపై ఒకానొక సమయంలో అసహనం కూడా వ్యక్తం చేసింది ఇలియానా. ఇక అలా అగ్రతారగా ఒక వెలుగు వెలిగిన ఈమె.. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుస సినిమాలు చేసి స్టార్ స్టేటస్ ను అందుకుంది. అయితే ఆ తర్వాత కాలంలో సౌత్ ఇండియాలో ఈమెను బ్యాన్ చేయడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది ఇలియానా.


ఇండస్ట్రీకి దూరమైన ఇలియానా..

ఇకపోతే బాలీవుడ్ లోనైనా వరుస అవకాశాలు లభిస్తున్నాయా అంటే అదీ లేదు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి నెట్టింట సంచలనం సృష్టించింది. అంతేకాదు భర్త ఎవరో చెప్పకుండా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పి మరొకసారి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు న్యూ ఇయర్ వేళ తన ఇన్స్టా లో ఒక వీడియో షేర్ చేస్తూ మరోసారి తల్లి కాబోతున్నానంటూ తెలియజేయడంతో అభిమానులు ఇన్ని ట్విస్ట్ లు ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

మళ్లీ తల్లి కాబోతున్న ఇలియానా..

ఆ వీడియోలో గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉంది? అనే విషయాన్ని చూపిస్తూ.. ఒక చిన్నపాటి వీడియో కూడా విడుదల చేసింది ఈ ముద్దుగుమ్మ. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తన కొడుకుతో క్షణం తీరిక లేకుండా సాగిపోయిందని, సెప్టెంబర్ లో మరొకసారి గర్భం దాల్చాను అంటూ ప్రెగ్నెన్సీ కిట్ ను కూడా చూపించింది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇలియానాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు మరో చిన్నారి త్వరలో రాబోతున్నారు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇలియానా వ్యక్తిగత విషయానికొస్తే.. కొన్నాళ్ల క్రితం తన ప్రియుడు మైఖేల్ డోలన్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఈమె 2023లో కుమారుడు పుట్టిన తర్వాత తన భర్త పేరు అలాగే ఫోటోని కూడా రివీల్ చేసింది. ఇక ఇప్పుడు మరొకసారి ప్రెగ్నెంట్ అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Ileana D’Cruz (@ileana_official)

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×