
CJI DY Chandrachud news(Today news paper telugu): తెలంగాణలో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు న్యాయం చేసే కోర్టు సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ఉండాలన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని కోర్టుల్లోనూ వసతుల కొరత ఉందన్నారు.
తెలంగాణలోని రాజేంద్రనగర్ లో నూతన హైకోర్టు భవనానికి సీజేఐ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. న్యాయ వ్యవస్థలో విలువలు పెంపొందించేలా సీనియర్ నాయమూర్తులు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందున కోర్టు కార్యకలాపాల్లో అంతర్జాలాన్ని కుడా వినియోగించుకోవాలన్నారు. ఇటీవలే ఈ-కోర్టు పథకం ద్వారా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్టుల్లోనూ మార్పు వస్తుందన్నారు. ప్రస్తుతం మన దేశంలో యువత సంఖ్య చాలా ఉందనని.. యువత ఎక్కువ మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు. సత్వర న్యాయాన్ని యువత ఎంతగానో కోరుకుంటుందని తెలిపారు.
అయితే కింద స్థాయి కోర్టుల్లోనే కాకుండా హైకోర్టుల్లో కూడా మౌలిక వసతుల కొరత ఉందని తెలిపారు. తెలంగాణలో కొత్త హైకోర్టు భవన నిర్మాణం కోసం చొరవ తీసుకున్నందున హైకోర్టు సీజేను అభినందించారు. త్వరలో నిర్మాణం కాబోయే కొత్త కోర్టు భవనంలో స్త్రీలు, దివ్యాంగులు వంటి విభన్న వర్గాలకు మరిన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
Also Read: TS TET 2024: టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మొదలైన దరఖాస్తు ప్రక్రియ
ఈ కోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీని నిర్మాణం కోసం రూ.500 కోట్లు వ్యయం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.