Big Stories

Pawan Kalyan: పార్టీ కార్యకర్తలకు, నేతలకు కీలక హెచ్చరికలు జారీ చేసిన పవన్ కళ్యాణ్

Pawan KalyanPawan Kalyan: జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పొత్త ధర్మాన్ని ఏ ఒక్కరూ కూడా మీర వద్దని హెచ్చరించారు. పొత్త ధర్మాన్ని పాటించి కూటమిని గెలుపించాలని జనసేనాని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్త ధర్మాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని లేనపోతే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. జగన్ ఓటమే లక్ష్యంగా కూటమి పార్టీలు పనిచేస్తున్నాయన్నారు.

- Advertisement -

పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. ఇప్పటికే జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 18 అసెంబ్లీ స్థానాలకు పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన మూడు స్థానాలపై ప్రస్తుతం కసరత్తు ప్రారంభించింది. ఆ మూడు స్థానాల్లో మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, విశాఖ దక్షిణ నియోకవర్గాల అభ్యర్థులపై ప్రస్తుతం జనసేన తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.

Also Read: CM YS Jagan: విశాఖ డ్రగ్స్ కేసులో బీజేపీ హస్తం.. సీఎం జగన్ సంచలన ఆరోపణలు

ఈ నేపథ్యంలో ఈ ఆయా నియోజకవర్గాల నేతలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో రెండు రోజుల్లో ఆ మూడు స్థానాలు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే మార్చి 30వ తేదీ నుంచి పవన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News