Big Stories

TS TET 2024: టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మొదలైన దరఖాస్తు ప్రక్రియ!

 TS TET Online ProcessTS TET 2024 Online Process : రాష్ట్రంలోని టీచర్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ప్రారంభమైంది. ఈ సారి డీఎస్సీ కంటే టీచర్ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించబోతోంది.

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాయనున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో 4 లక్షల మంది టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉన్నారు. అయితే డీఎస్సీ పరీక్షకు ముందు రాష్ట్రంలో టెట్ నిర్వహించడంతో ఈ ఏడాది డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు సైతం టెటే రాయనున్నారు. సర్వీసు టీచర్లు సైతం టెట్ పరీక్షకు హాజరవుతున్నారు.

- Advertisement -

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బుధవారం నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ చేసుకోవచ్చు. ఈ అర్హత పరీక్షలు మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి.

Also Read: KTR Shocking Comments: పోరాట పంథాలో కథం తొక్కుదాం.. కేసీఆర్‌ని ప్రజలే కాపాడుకుంటారు.. కేటీఆర్ సంచలన ట్వీట్

ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు ఓ ఎగ్జామ్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మరో ఎక్జామ్ జరగనుంది. మే 15వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్లో అందుబాటులోకి వస్తాయని పరీక్ష నిర్వాహణ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల ఫలితాలు జూన్ 12న విడుదల చేయనున్నారు. అయితే అభ్యర్థులు ఒక పేపర్ రాయాలనుకుంటే రూ.1,000 ఫీజు, అదే రెండు పేపర్లలో పరీక్ష రాయాలనుకుంటే రూ.2,000 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News