BigTV English

Foxconn: తెలంగాణలోనే ఫాక్స్‌కాన్‌.. కంపెనీ ఛైర్మన్‌ క్లారిటీ.. కేసీఆర్‌కు తైవాన్‌ ఆహ్వానం..

Foxconn: తెలంగాణలోనే ఫాక్స్‌కాన్‌.. కంపెనీ ఛైర్మన్‌ క్లారిటీ.. కేసీఆర్‌కు తైవాన్‌ ఆహ్వానం..

Foxconn: ఫాక్స్‌కాన్. ఐఫోన్లు తయారు చేసే ఫేమస్ కంపెనీ. ఇన్నాళ్లు తైవాన్, చైనాకే పరిమితమైన ఫాక్స్‌కాన్.. ఇప్పుడు ఇండియాలోనూ తయారీ కేంద్రం స్టార్ట్ చేస్తోంది. ఫాక్స్‌కాన్ కంపెనీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అటు, బెంగళూరులో ఫాక్స్‌కాన్ అంటూ అక్కడి సర్కారు స్టేట్‌మెంట్ ఇచ్చింది. కట్ చేస్తే.. తాము కంపెనీ ఏర్పాటుకు ఇప్పటి వరకూ ఇండియాలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సంస్థ నుంచి ప్రకటన వచ్చింది. దీంతో.. అసలు ఫాక్స్‌కాన్ భారత్‌లో తయారీ కేంద్రం పెడుతోందా? లేదా?.. పెడితే ఎక్కడ పెడుతోంది? హైదరాబాదా? బెంగళూరా? అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది.


ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ ఇటీవల ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. పలు పెట్టుబడి అంశాలపై చర్చించారు. అదే రోజు యాంగ్ పుట్టిన రోజు కూడా కావడంతో.. సీఎం కేసీఆర్ స్వయంగా గ్రీటింగ్ కార్డు రాసి ఆయనకు బర్త్‌డే విషెష్ చెప్పారు. మంచి విందు కూడా ఇచ్చారు.

కేసీఆర్ ఇచ్చిన విందుకు ఫాక్స్‌కాన్ ఛైర్మన్ ఫుల్ ఫిదా అయినట్టున్నారు. స్వస్థలం తైవాన్‌కు వెళ్లాక.. సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆయన్ను తైవాన్ పర్యటనకు రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు. తైపీలో కేసీఆర్‌కు ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో గౌరవంగా ఉంటుందని యాంగ్ లియూ లేఖలో రాశారు. ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా తనకు, తన బృందానికి మంచి ఆతిథ్యం ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత గ్రీటింగ్ కార్డుతో తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పారు.


పనిలో పనిగా.. ఫాక్స్‌కాన్ ఏర్పాటుపైనా లేఖలో క్లారిటీ ఇచ్చారు యాంగ్ లియూ. తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ ఆలోచనలు, ప్రణాళికలు తనలో స్ఫూర్తి నింపాయన్నారు యాంగ్ లియూ. భారతదేశంలో తనకు కొత్త స్నేహితుడు లభించాడని, భవిష్యత్‌లో తనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు లేఖలో తెలిపారు.

ఈ నెల రెండో తేదీన జరిగిన సమావేశంలో చెప్పినట్లుగానే.. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తయారీ కేంద్రం ఏర్పాటుకు ఫాక్స్ కాన్ కట్టుబడి ఉందని లేఖలో స్పష్టం చేశారు కంపెనీ ఛైర్మన్ యాంగ్ లియూ. కొంగరకలాన్ పార్కులో కార్యకలాపాలు త్వరగా ప్రారంభించేలా తమ బృందానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఫ్యాక్స్‌కాన్ ఛైర్మన్ రాసిన లేఖతో.. ఐఫోన్ తయారీ కేంద్రం తెలంగాణలోనే అని క్లారిటీ వచ్చేసింది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×