TDP vs YCP: ధర్మవరంలో పొలిటికల్ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. దీంతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రేపు వైసీపీ వర్గీయులు కొందరు బీజేపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలో ఫ్లెక్సీలు కట్టే విషయంలో ఘర్షణ మొదలైంది. ఇరు వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. దాడిలో వాహనాలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. రెండు స్కార్పియో వాహనాలు, మూడు బైక్‌లు ధ్వంసం అయ్యాయి. పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టీడీపీ శ్రేణులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
Also Read: Agniveer Vayu Jobs: అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోని రూ.40,000 జీతం.. రేపే లాస్ట్ డేట్
ఇరు వర్గీయులు దాడి చేసుకోవడంతో వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇరు వర్గీయులను పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లతో దాడిచేసుకోడంతో.. టీడీపీ శ్రేణులకు తీవ్ర గాయాలయ్యాయి. ఫ్లెక్సీల విషయంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే ధర్మవరంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలను పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.