Nitish Kumar Reddy Injury: తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న ఈ యంగ్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి.. ఇంగ్లాండ్ తో టి-20 సిరీస్ కి దూరమయ్యాడు. తొలి టి-20 మ్యాచ్ లో ఆడిన నితీష్.. రెండవ టి-20 మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరిగే టి-20 సిరీస్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ టాస్ సమయంలో వెల్లడించారు.
AlsoRead: Australian Open 2025 Final: ఆస్ట్రేలియా ఓపెన్ – 2025 విజేతగా ఇటలీకి చెందిన సినర్
నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శివమ్ దుబే భారత తుది జట్టులోకి వచ్చాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మేనేజ్మెంట్ అతడు రిస్క్ తీసుకోకుండా విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం. నితీష్ కుమార్ రెడ్డి ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడు బెంగుళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి వెళ్ళనున్నాడు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డికి గాయం తీవ్రత ఎక్కువగా ఉందని.. అతడు ఐపిఎల్ 2025 సీజన్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పలు కధనాలు పేర్కొంటున్నాయి.
దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఐపీఎల్ కి దూరమైతే అతడి స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ ప్లేయర్ ని ఎంపిక చేస్తుందనేదానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి గాయం పై సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం స్పందించింది. అతడు త్వరగా కోలుకోవాలని SRH తన అఫీషియల్ అకౌంట్ నుంచి ఓ ట్వీట్ చేసింది.
” నితీష్ కుమార్ రెడ్డి.. నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. మరింత బలంగా తిరిగి రా” అని ట్వీట్ చేసింది. 2024 లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన కారణంగా అతడిని ఐపీఎల్ 2024 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ 20 లక్షలకు జట్టులోకి తీసుకుంది. అయితే గత సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడిన నితీష్ రెండు ఆఫ్ సెంచరీలతో సహా 303 పరుగులు చేశాడు.
అంతేకాదు తన బౌలింగ్ తో మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. దీంతో గత నవంబర్ లో జరిగిన ఐపీఎల్ – 2025 మెగా వేళానికి ముందే హైదరాబాద్ జట్టు అతడిని 6 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ వేళానికి ముందే నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టుకి ఎంపికయ్యాడు. టి-20 లలో అతడి ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా ఐపీఎల్ 2025 వేలంలో అతడికి 10 కోట్లకు పైగా ధర పలుకుతుందని అంతా భావించారు.
AlsoRead: Paarl Royals: మీ దుంపతెగ.. 20 ఓవర్లు స్పిన్నర్లే వేసారా.. రూల్స్ బ్రేక్ చేసినట్లేనా ?
కానీ హైదరాబాద్ అతడిని ఆరు కోట్లకు రిటైన్ చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మొదట నితీష్ ని 11 కోట్లకు రిటైన్ చేసుకోవాలని హైదరాబాద్ ప్లాన్ చేసింది. కానీ సౌత్ ఆఫ్రికా ఆటగాడు హేన్రిచ్ క్లాసెన్ ని రిటైన్ చేసుకోవడానికి 23 కోట్లు ఖర్చు చేయడం వల్ల.. నితీష్ కి ఎక్కువ మొత్తం కేటాయించలేకపోయారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.