BigTV English

Arekapudi Gandhi Vs Kaushik Reddy: వీధికెక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్,కేటీఆర్ మౌనమేలా?

Arekapudi Gandhi Vs Kaushik Reddy: వీధికెక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్,కేటీఆర్ మౌనమేలా?

Arekapudi Gandhi Vs Kaushik Reddy: బీఆర్ఎస్‌లో నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ముదిరి పాకాన పడ్డాయా? ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు క్రమంగా జారుకుంటున్నారా? అంతర్గత కలహాలతో నేతలు వీధిన పడ్డారా? నేతల మధ్య చిచ్చుపెట్టిందెవరు? బీఆర్ఎస్ కీలక నేతలా? లేక అంతర్గత కలహాలా ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి.


కారు పార్టీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయి. నేతల వ్యవహారశైలి నచ్చక నేతలు ఒకొక్కరుగా కారు దిగిపోతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. గులాబీ పార్టీపై కాసింత ఆగ్రహంగా ఉన్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగమే ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారం. ఇరువురు నేతల మధ్య మాటలు మరింత ముదిరి పాకాన పడ్డాయి. నేతల సవాళ్లతో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

మీ ఇంటికి వస్తానని ఒకరంటే.. నేనే మీ ఇంటికి వస్తానంటూ ఒకరిపై మరొకరు ఛాలెంజ్‌ విసిరారు. తాజా పరిస్థితులను గమనించిన పోలీసులు ఉదయం నుంచే కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు.. వ్యక్తిగత అంశాలను బయట పెట్టుకున్నారు. ఎవరు బ్రోకరో ప్రజలందరికీ తెలుసంటూ ఇరువురు నేతల మధ్య మాటల రచ్చ సాగింది.


ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైలెంట్‌గా ఉండటాన్ని పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మౌనం వెనుక కారణమేంటి? వీరికి తెలిసే ఈ రచ్చ జరుగుతుందా? లేక తెర వెనుక నుంచి చేయిస్తున్నారా? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

ALSO READ: దమ్ముంటే రా.. చూసుకుందాం, కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ వీరంగం

నార్మల్‌గా అయితే ఆ తరహా రచ్చ ప్రాంతీయ పార్టీల్లో పెద్దగా ఉండదన్నది కొందరి నేతల మాట. ఈ విధంగా ఏ పార్టీలోనూ చూడలేదని అంటున్నారు. బహుశా.. గులాబీ కీలక నేతల వ్యవహారశైలే దీనికి కారణమన్న వాదనలూ లేకపోలేదు. ఇన్నాళ్లు గుట్టుగా వ్యవహరించిన కారు పార్టీ.. పరువు పోతున్నా, ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? బీఆర్ఎస్‌లో ఇలాంటి కలహాలు వీరితో ఆగుతాయా? ఇంకా కంటిన్యూ అవుతుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×