BigTV English

Arekapudi vs Koushik: దమ్ముంటే రా.. చూసుకుందాం, కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ వీరంగం

Arekapudi vs Koushik: దమ్ముంటే రా.. చూసుకుందాం, కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ వీరంగం

Arekapudi Gandhi Challenge to Koushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మల్యే పాడి కౌశిక్ రెడ్డి.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వాగ్యుద్ధం జరుగుతోంది. అరికెపూడి గాంధీకి పీఏసీ పదవి ఇవ్వడంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను మలుపుతిప్పాయి. తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని అరికెపూడి గాంధీ చెబుతున్నా.. పార్టీని మోసం చేశావంటూ కౌశిక్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తన ఇంటిపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో.. అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు..  “అరేయ్ కౌశిక్ రెడ్డి.. దమ్ముంటే రారా నా కొడకా ” అంటూ గాంధీ రిలీజ్ చేసిన వీడియో.. సంచలనం రేపింది.


“11 గంటలకు నా ఇంటికి వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగురవేయకపోతే.. నేనే నీ ఇంటికి వస్తా. దమ్ముంటే రారా నా కొడకా.. నువ్వో నేనో తేల్చుకుందాం. బ్రోకర్ నా కొడకా. పార్టీని భ్రష్టుపట్టించి, మాజీ ముఖ్యమంత్రిని నాశనం చేసింది కాక.. కాంగ్రెస్ నుంచి కొందరు పెద్దల్ని బీఆర్ఎస్ జాయిన్ చేస్తానని చెప్పిన బ్రోకర్ నా కొడుకువి నువ్వు. మిగతా బ్రోకర్ నా కొడుకులతో వచ్చి నా ఇంటికి వచ్చి జెండా ఎగురవేస్తానంటే చూస్తు చేతులు కట్టుకుని కూర్చోడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ యుద్ధం బీఆర్ఎస్ కి నాకు కాదు. కౌశిక్ రెడ్డికి, నాకు మధ్య జరిగే యుద్ధం. నువ్వో నేనో తేల్చుకుందాం. రా బాంచత్. తేల్చుకుందాం.” అని అరికెపూడి గాంధీ వీడియో రిలీజ్ చేశారు.

ఇజ్జత్ లేనివారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కొందరు దుర్మార్గులు కేసీఆర్ ను దొంగదెబ్బ తీస్తున్నారని గాంధీ ఆరోపించారు. 12 గంటలు అవ్వగానే తాను కౌశిక్ రెడ్డి ఇంటికి బయల్దేరుతానని గాంధీ తెలిపారు. దీంతో భారీ ఎత్తున ఆయన అనుచరులు ఇంటికి చేరుకున్నారు.


సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పోలీసులు ఇద్దరి ఇళ్ల వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇరువురి ఇళ్ల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని పోలీసులు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×