BigTV English

Telangana politics: కారుకి కొత్త కష్టాలు.. సంకేతాలు ఇచ్చిన సీఎం చంద్రబాబు

Telangana politics: కారుకి కొత్త కష్టాలు.. సంకేతాలు ఇచ్చిన సీఎం చంద్రబాబు

Telangana politics: బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్ పట్టుకుందా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బరిలోకి దిగుతుందా? టీడీపీ బరిలో ఉంటే కారుకి కష్టాలు తప్పవా? టీడీపీ రూపంలో కేసీఆర్‌కు అసలు సమస్య వచ్చిపడిందా? అసలే అధికారం పోయి ఇబ్బందిపడుతున్న కారు పార్టీకి, సీఎం చంద్రబాబు మాటలు ఆ పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు.


అధికారం పోయిన తర్వాత తెలంగాణలో కారు పార్టీకి కష్టాలు తీవ్రమయ్యాయి. గడిచిన ఏడాదిన్నరగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారు. పార్టీ నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఇంకోవైపు పార్టీలో అంతర్గత కలహాలు వెంటాడుతున్నాయి.

ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో విలీనానికి అంగీకరించేది లేదని కవిత కుండబద్దలు కొట్టారు.ఇలాంటి సమయంలో సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కి ఏడాది గడిచింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.


ఇతర పార్టీలకు భిన్నంగా ఉండే తెలుగుదేశం పార్టీ..  దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి కూడా. కేవలం ఏపీ కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు గెలవడంపై ఏమైనా ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు తనదైన శైలిలో జవాబు ఇచ్చారు సీఎం చంద్రబాబు.

ALSO READ: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. మిగతా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలనే ఆలోచన మొన్నటివరకు లేదన్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాయని చెప్పుకొచ్చారు. కొంత ఇబ్బంది వచ్చినా వాటిని ముందుకు తీసుకుని వెళ్తామన్నారు. ఇటీవల అండమాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుందన్నారు.

ఈ క్రమంలో తెలంగాణపై ఫోకస్ ఉందా అన్న ప్రశ్నలు రిప్లై ఇచ్చారు సీఎం చంద్రబాబు. తెలంగాణపై ఫోకస్ కచ్చితంగా ఉంటుందన్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీడీపీ పుట్టిందన్నారు. తెలుగు జాతి ఎక్కడున్నా వారి అభివృద్ధి కోసం పని చేసే పార్టీ తెలుగుదేశమన్నారు.

ఈ లెక్కన వచ్చే ఎన్నికలకు టీడీపీ రెడీ అవుతుందని సంకేతాలు ఇచ్చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం. టీడీపీ గనుక బరిలో ఉంటే కారు పార్టీకి కష్టాలు తప్పవని అంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న కీలక నేతలంతా టీడీపీ నుంచి వెళ్లినవారే. రేపటి రోజున బీజేపీతో కలిసి టీడీపీ బరిలోకి దిగడం ఖాయమన్నది ఆ పార్టీ నేతల మాట.

అదే జరిగితే.. ఇప్పుడున్న సగానికి పైగానే ఉన్న బీఆర్ఎస్ నేతలు టీడీపీ వైపు వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. పదవుల మాట ఏమోగానీ కనీసం ఎమ్మెల్యేగా గెలుస్తామని అంటున్నారు. తెలంగాణలోని టీడీపీ వస్తే మంచి జరుగుతుందని చాలామంది ప్రజలు ఓపెన్‌గా చెబుతున్నారు.

జరుగుతున్న పరిణామాలను ముందుగానే పసిగట్టిన బీఆర్ఎస్, టీడీపీపై విష ప్రచారం మొదలుపెట్టిందని అంటున్నారు కొందరు నేతలు. ప్రస్తుతం అభివృద్ధి జరుగుతుందంటే కేవలం టీడీపీ వల్లే మాత్రమేనని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో టీడీపీకి మంచి రిలేషన్స్ ఉన్నాయని, బీఆర్ఎస్ ఆ విధంగా లేవని అంటున్నారు.

 

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×