Castor Oil: ఈ రోజుల్లో చాలా మంది తమ చర్మాన్ని అలాగే జుట్టును జాగ్రత్తగా చూసుకోవడానికి అనేక రకాల ప్రొడక్ట్స్ వాడుతున్నారు. కానీ వీటికి బదులుగా హోం రెమెడీస్ వాడటం చాలా మంచిది. హోం రెమెడీస్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. ఇదిలా ఉంటే .. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటం కోసం కొబ్బరి నూనె, బాదం నూనె, ఆముదం వంటివి అనేక మంది వాడుతుంటారు.
ముఖ్యంగా ఆముదం చర్మం, జుట్టు రెండింటికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఆముదం నూనెను జుట్టు, చర్మానికి ఉపయోగించే సరైన పద్దతి గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టుకు ఉపయోగించే విధానం:
మీరు జుట్టుకు ఆముదం నూనెను ఉపయోగించాలనుకుంటే.. ముందుగా దానిని కాస్త వేడి చేయాలి. ఈ ఆయిల్ చాలా మందంగా ఉంటుంది. కాబట్టి మీరు దానిలో వేరే ఏదయినా నూనె కలపాలి. ఈ నూనె వేడి చేసిన తర్వాత.. దానిలో సగం కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆలివ్ నూనె కూడా కలుపుకోవచ్చు. రెండు నూనెల నిష్పత్తి 50-50 శాతం ఉండేలా చూసుకోండి. రాత్రిపూట ఈ నూనెతో మీ జుట్టును మసాజ్ చేయండి. రాత్రంతా ఇలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయండి.
ప్రయోజనాలు:
మీరు ఈ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే.. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ నూనె జుట్టును మందంగా, బలంగా చేస్తుంది. దీంతో పాటు మీరు చుండ్రు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే దాని నుండి మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఈ నూనె చివర్లు చిట్లడం, తగ్గించడానికి కూడా పనిచేస్తుంది.
ముఖానికి ఉపయోగించే విధానం:
మీరు ముఖానికి ఆముదం నూనెను ఉపయోగించాలనుకుంటే.. మీరు దానిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. మీరు దీనిని మాయిశ్చరైజర్‌గా ఉపయోగించాలనుకుంటే.. అరచేతిపై కొన్ని చుక్కలు తీసుకొని ముఖం లేదా శరీరంపై రాయండి. కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ వంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే.. ఈ ఆయిల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ అది కళ్ళలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. లేకుంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
Also Read: డైలీ ఇలా చేస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం
ముఖానికి దీన్ని ఎలా ఉపయోగించాలి ?
మీరు ఆముదం నూనెను క్రమం తప్పకుండా ముఖానికి ఉపయోగిస్తే.. అది పొడి చర్మాన్ని తేమగా చేస్తుంది. దీని వాడకం ముడతలు, సన్నని గీతలను తగ్గిస్తుంది. ఈ నూనె మొటిమల-బాక్టీరియాను చంపుతుంది. దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
ఆముదాన్ని తరచుగా ముఖానికి వాడటం వల్ల కూడా ముఖం తెల్లగా మెరిసిపోతుంది. అంతే కాకుండా ఈ ఆయిల్ ముఖానికి తగిన పోషణను కూడా అందిస్తుంది. దీనిలో ఉండే లక్షణాలు చర్మ సమస్యలు కూడా రాకుండా చేస్తాయి. అంతే కాకుండా ఇవి ముఖాన్ని కాంతి వంతంగా మారుస్తాయి.