Telangana politics: తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? బీజేపీలో విలీనానికి బీఆర్ఎస్ సిద్ధమైందా? కేంద్రమంత్రి మాటల వెనుక అసలు సారాంశం ఏంటి? తెర వెనుక విలీనం ప్రయత్నాలు క్రమంగా జోరందుకుంటుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ట్రెండ్‌కు తగ్గట్టుగా మారకుంటే లైఫ్ ఉండదని కొందరు నేతలు భావిస్తున్నారు. ఇప్పుడున్న రాజకీయాల్లో నాన్చుడి ధోరణి కష్టమని అంటున్నారు. లేకుంటే పార్టీ డ్యామేజ్ కావడం ఖాయమనే సంకేతాలు లేకపోలేదు.
రెండువారాల కిందట బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమంటూ జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో తెరపైకి వచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో విలీనానికి అంగీకరించ లేదని ‘ఆఫ్ ద రికార్డు’ల్లో తెగేసి చెప్పేశారు. ఈ విషయం బయటకు రాగానే ఆ పార్టీ నేతలు ఆలోచలో పడ్డారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ విలీనం అయితే తమ పరిస్థితి ఏంటని నేతలు చర్చించుకోవడం మొదలైంది. ఈ విషయంలో బీఆర్ఎస్ గుంభనంగా వ్యవహరిస్తోంది. అలాంటిదేమీ లేదని పైకి చెబుతున్నా, లోలోపల జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయని అంటున్నారు నేతలు.
ALSO READ: ఏసీబీ విచారణకు కేటీఆర్.. కేబీఆర్ పార్క్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఏపీ బీజేపీ నేత, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రాముఖ్యత తగ్గిందని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్-బీజేపీ బలమైన పార్టీలుగా ఉన్నాయని గుర్తు చేశారు.
రాజకీయాల్లో మనుగడ కోసం తీసుకునే నిర్ణయాలు ముందుగా ఊహించలేమన్న ఆయన, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మనసులోని మాట బయటపెట్టారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని గుర్తు చేశారు.
గతంలో కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమైందన్నారు కేంద్రమంత్రి. ఈ లెక్కన బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయితే తప్పేంటన్నది మంత్రి ఆలోచనగా చెబుతున్నారు కొందరు నేతలు. నార్మల్‌గా కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ రాజకీయాల గురించి చాలా తక్కువ మాట్లాడుతారు. ఆయన నోట వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడంపై బీఆర్ఎస్ నేతల్లో ఆసక్తి నెలకొంది.
తమకు తెలీకుండా వెనుక నుంచి ఏదో జరుగుతోందన్న చర్చ సాగుతోంది. నిప్పు లేనిదే పొగరాదని, సాక్షాత్తూ కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అలా అన్నారంటే కచ్చితంగా విలీనం ఖాయమని అంటున్నారు కారు పార్టీ నేతలు. మొత్తానికి రాబోయే రోజుల్లో విలీనంపై ఆ పార్టీ నేతలు ఏమంటారో చూడాలి.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేంద్ర మంత్రి క్లారిటీ..
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాముఖ్యత తగ్గింది
కాంగ్రెస్, బీజేపీ బలమైన పార్టీలుగా ఉన్నాయి
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరతారు
గతంలో కాంగ్రెస్ లో పీఆర్పీ… pic.twitter.com/6gYuRcBYQ7
— BIG TV Breaking News (@bigtvtelugu) June 15, 2025