BigTV English

Mehendi Removing: మెహెందీని చేతినుండి త్వరగా తొలగించాలనుకుంటున్నారా? ఈ ఐదు చిట్కాలు పాటించండి

Mehendi Removing: మెహెందీని చేతినుండి త్వరగా తొలగించాలనుకుంటున్నారా? ఈ ఐదు చిట్కాలు పాటించండి

పండుగలు, వివాహాల సమయంలో చేతులను అద్భుతమైన మెహెందీ డిజైన్లతో నింపేస్తారు. అమ్మాయిలు వేడుకకు అదనపు ఆకర్షణ ఈ మెహెందీ. ఇది ఒక సంప్రదాయంగా కూడా చెప్పుకోవచ్చు. ఉత్సవాలు ముగిసిన తర్వాత కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. కానీ ఇలా చేతినిండా మెహెందీలతో వెళ్లాలంటే కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటి వారు ఇంటి చిట్కాలు ద్వారా మెహెందీని తొలగించుకోవచ్చు. దీనికోసం మీరు ఎలాంటి రసాయన పదార్థాలు వాడాల్సిన అవసరం లేదు.


వంట సోడాతో
బేకింగ్ సోడాను ఉపయోగించి మీరు మెహందీని తొలగించుకోవచ్చు. ఇందుకోసం మీరు ఒక కప్పులో రెండు నుంచి మూడు స్పూన్ల బేకింగ్ సోడా వేయాలి. అందులోనే 1/2 కప్పు నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి. దీన్ని మెహెందీ ఉన్నచోట రాసి పావుగంట సేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత అక్కడ చేత్తోనే సున్నితంగా స్క్రబ్ చేయడం మొదలుపెట్టాలి. కొంచెం గోరువెచ్చని నీటిని చిలకరించి మళ్లీ మర్దనా చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మెహెందీ పొరలు పొరలుగా వచ్చేస్తుంది. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెహందీ చాలా వరకు తొలగిపోతుంది.

టమాటో రసంతో
టమాటో రసంలో సిట్రిక్ యాసిడ్ నిండి ఉంటుంది. ఇది సహజమైన ఎక్స్ ఫోలియేటర్‌గా పని చేస్తుంది. మెహందీ రంగును విచ్చిన్నం చేయడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు బాగా పండిన టమోటోను తీసుకొని రెండు ముక్కలుగా చేయండి. ఆ ముక్కతో మెహెందీ ఉన్నచోట బాగా రుద్దండి. ఆ తర్వాత కొన్ని చుక్కల నిమ్మ రసాన్ని కూడా మెహందీ ఉన్నచోట వేసి బాగా చేత్తోనే మర్దన చేయండి. అలా పావుగంటసేపు చేసిన తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోండి. తర్వాత నూనెను ఆ ప్రాంతంలో రాసి మాయిశ్చరైజర్ చేయండి. దాదాపు మెహెందీ డిజైన్ తొలగిపోతుంది.


షుగర్ స్క్రబ్
పంచదార కూడా మంచి స్కిన్ ఎక్స్ పోలియేటర్ గా పనిచేస్తుంది. అంటే చర్మంపై ఉన్న వ్యర్ధాలను, మురికిని తొలగిస్తుంది. ఒక స్పూను కొబ్బరి నూనెలో రెండు స్పూన్ల చక్కెరను వేసి బాగా కలపండి. దాన్ని మెహెందీ ఉన్నచోట రుద్దండి. మీరు దీనిని రుద్దుతున్నప్పుడు చక్కెరను పూర్తిగా కరిగిపోనివ్వండి. అంతవరకు అలా రుద్దుతూనే ఉండండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. చక్కెరతో రుద్దిన చోట చర్మం కాస్త మంటగా లేదా ఎరుపుగా మారవచ్చు. కాబట్టి మాయిశ్చరైసర్ రాయండి.

ఉప్పు నీటితో
ఉప్పునీరు కూడా ఎంతో ఉత్తమంగా పనిచేస్తుంది. చర్మంపై ఉన్న మలినాలను తొలగిస్తుంది. ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకొని ఐదు స్పూన్ల ఉప్పు వేయండి. అందులో మెహెందీ ఉన్న చేతులను లేదా కాళ్ళను 20 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత పొడి గుడ్డతో గట్టిగా తుడవండి. మెహందీ డిజైన్ చాలా వరకు తొలగిపోతుంది.

హెయిర్ కండిషనర్ తో
జుట్టుకు పట్టు లాంటి మెరుపును ఇచ్చే హెయిర్ కండిషనర్ను కూడా ఇందుకోసం ఉపయోగించవచ్చు. చేతుల్లోకి కొంత హెయిర్ కండిషనర్ తీసుకొని మెహందీ డిజైన్లు ఉన్న చోట రుద్దండి. పావుగంట సేపు అలా రుద్దుతూ ఉండండి. ఆ తర్వాత సాధారణ నీటితో కడిగేయండి. చేతులపై ఉన్న మెహందీ డిజైన్ చాలా వరకు తొలగిపోతుంది.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×