BRS Manifesto 2023 : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రం మొత్తం రాజకీయ వేడి పెరిగింది. అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ రికార్డును సృష్టించాలని అధికార బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో భాగంగా నేడు.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను విడుదల ప్రకటించారు సీఎం కేసీఆర్.మేనిఫెస్టో విడుదలకు ముందు కేసీఆర్.. అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. 5-6 మినహా.. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లను కేటాయించామన్నారు.
వేములవాడ ఎమ్మెల్యేతో న్యాయపరమైన సమస్య ఉండటంతో అభ్యర్థిని మార్చినట్లు వివరించారు. పార్టీలో చిన్న కార్యకర్తే అయినా అభ్యర్థులు నచ్చజెప్పుకోవాలని సూచించారు. ప్రతి ఎన్నికలకు నియమావళి మారుతుంటుందని, ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. ఇప్పటి వరకూ 51 బీ ఫారమ్ లే పూర్తయ్యాయని, మిగతా బీ ఫారమ్ లు రెడీ అవుతున్నాయని తెలిపారు. ఈ రోజు 51 మందికి, మిగతా వారికి రేపు బీ ఫారమ్ లు అందిస్తామని వివరించారు. అయితే పలు అభ్యర్థులను మార్చే అవకాశం ఉండటంతో.. బీఫామ్ లు అందని వారిలో ఆందోళన నెలకొంది.
అభ్యర్థులకు బీ ఫామ్ లు అందజేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ..గతంలో ప్రకటించిన మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే చెందిందన్నారు. కల్యాణలక్ష్మీ, రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏ మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా అమలు చేసినట్లు వెల్లడించారు. బీసీలు, మైనారిటీలు, రైతులు, కార్మికులు అందరినీ దృష్టిలో ఉంచుకుని పనిచేశామని, 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో సెక్యులర్ సమాజాన్ని నిర్మించేందుకు కష్టపడ్డామన్నారు. 2014,2018 ఎన్నికల మేనిఫెస్టోలో 10 శాతం చెప్పినా.. 90 శాతం హామీలను నెరవేర్చామన్నారు. దళిబంధు పదకాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని వివరించారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల తర్వాత నెరవేరుస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టో