BigTV English

Flood Damage: వామ్మో.. కేవలం వరద వల్ల ఇంత నష్టం వాటిల్లిందా..? ఓరి దేవుడా..!!

Flood Damage: వామ్మో.. కేవలం వరద వల్ల ఇంత నష్టం వాటిల్లిందా..? ఓరి దేవుడా..!!

Powerpoint Presentation on flood damage: రాష్ట్రంలో భారీగా వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రం అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలువురు మృత్యవాతపడ్డారు. పశువులు, మూగ జీవులు వరదల్లో కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రూ. కోట్లలో వాటిల్లింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. సచివాలయంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ కి వరద ప్రభావం, నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.


Also Read: తెలంగాణ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం..

రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో తక్షణ సాయంతోపాటు శాశ్వత పునరుద్ధరణ పనుల కోసం తగిన నిధులు కేటాయించాలని కేందమంత్రికి వివరించారు. తెలంగాణలో వరదల వల్ల సుమారుగా రూ. 5438 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సీఎం వివరించారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల విడుదల విషయంలో కూడా మార్గదర్శకాలను సైతం సడలించాలని కోరారు.


ఏపీకి ఏ విధంగా సాయం చేస్తారో తెలంగాణకు కూడా అదేవిధంగా సాయం అందించాలన్నారు. రెండు రాష్ట్రాలకు ఒకే విధంగా సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక్క రోజే 40 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదైందని, వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని సీఎం చెప్పారు. రహదారులు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో రాకపోకలు స్తంభించిపోయాని సీఎం పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాలల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయానని కేంద్రమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో తక్షణ సాయం కింద వరద బాధితులకు కుటుంబానికి రూ. 10 వేల చొప్పున పంపిణీ చేసినట్లు కేంద్రమంత్రికి సీఎం వివరించారు.

ఎడితెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి ఎదురైంది. పలు చోట్ల అయితే, ఎప్పుడు వరద నీరు వచ్చి ముంచెత్తుతుందోనని బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఇళ్ల పైకప్పు పైకి ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నటువంటి పరిస్థితి. ఖమ్మంలో జిల్లాలో ఇటుకబట్టీలో కూలీ పని చేసుకునే దంపతులిద్దరూ మృత్యువాతపడ్డారు. పలువురు వరదలో కొట్టుకుపోయారు. పశువులు కూడా వరదలో కొట్టుకుపోయాయి. పంటపొలాలు వేల ఎకరాల్లో వరదల్లో కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విధంగా వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలు సర్వం కోల్పోయారు. ఈ వివరాలన్నిటినీ సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ కు క్లూప్తంగా వివరించారు. ప్రతి విషయాన్ని తెలుసుకున్న కేంద్రమంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. కేంద్రమంత్రి నుంచి మరిన్ని నిధులు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Also Read: ఎట్టకేలకు స్పందించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు భారీ సాయం.. ఎంత ప్రకటించిందంటే?

ఈ సమావేశానికి కేంద్రమంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితోపాటు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×