E-Paper
Advertisement

Road Accident: ఘోరాతిఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి.. వాహనంలోనే నుజ్జునుజ్జైన ప్రయాణికులు

Road Accident: ఘోరాతిఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి.. వాహనంలోనే నుజ్జునుజ్జైన ప్రయాణికులు
Advertisement

Road Accident in UP: రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని 12 మంది దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముందు వెళ్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే..

Also Read: భోపాల్‌లో ఏపీ విద్యార్థి మృతి.. డ్రగ్స్ తీసుకోనందుకే చంపేశారంటున్న బంధువులు!

Advertisement

యూపీలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా అలీగఢ్ బైపాస్ రోడ్డులోని మాటై గ్రామ సమీపంలో సాయంత్రం సమయంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఆగ్రా నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న బస్సు.. ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో 12 మంది మృతిచెందారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పలువురు వాహనదారులు, పాదాచారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బొలెరో వాహనాన్ని బస్సు బలంగా ఢీకొనడంతో బొలెరోలో ఉన్నవారు నుజ్జునుజ్జయ్యారు. మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం ఈ ఘోర ప్రమాదం గురించి సంబంధిత అధికారులు, అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అధికారులు, అంబులెన్స్ అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. కాగా, చికిత్స పొందుతున్న మరో నలుగురు పరిస్థితి కూడా విషయమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: గుంటూరులో సైనైడ్ గ్యాంగ్.. 4 హత్యలు, 3 హత్యాయత్నాలు.. నిందితులంతా మహిళలే

Advertisement

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×