E-Paper
Advertisement

Indiramma Saree Scheme: కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు.. రెండు దశల్లో పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం

Indiramma Saree Scheme: కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు.. రెండు దశల్లో పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం
Advertisement

Indiramma Saree Scheme: కోటి మంది అర్హత గల మహిళలకు కోటి చీరలు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. రేపు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ తీరుపై సీఎం రేవంత్ ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ చీరలను సిరిసిల్ల చేనేత కార్మికులే తయారు చేశారు. తయారీ ప్రక్రియలో కొంత ఆలస్యం జరగటం వల్ల వీటి పంపిణీని రెండు దశల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.మొదటి దశ పంపిణీ గ్రామీణ ప్రాంతాలలో జరుగుతుంది. రేపటి నుంచి డిసెంబర్ 9వ తేదీ లోపల గ్రామాల్లో పంపిణీని తప్పనిసరిగా పూర్తి చేయాలి అని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

Advertisement

రెండవ దశ పంపిణీ పట్టణ ప్రాంతాలలో పంపిణీ చేయనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) లోపల పట్టణ ప్రాంతాల పంపిణీ పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళా దినోత్సవానికల్లా ఈ పథకం ఫలాలు పట్టణ మహిళలకు అందాలని ఆయన ఆకాంక్షించారు.

చీరల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు అని సీఎం రేవంత్ అధికారులకు తేల్చి చెప్పారు. పంపిణీ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా, పారదర్శకత కోసం టెక్నాలజీని వినియోగించాలని ఆయన సూచించారు. ఈ మొత్తం పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభంలో భాగంగా.. నెక్లెస్ రోడ్ వద్ద ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, సీఎం రేవంత్ రెడ్డి గ్రామీణ మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.

ALSO READ: Medak News: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్ఐ.. టపాకాయలు కాల్చి ఊరుఊరంతా సంబరాలు

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×