BigTV English

Mahayuti Alliance : షిండే, అజిత్ పవార్‌ల వెంటే మహా ప్రజలు.. పార్టీలను చీల్చినా ఎందుకింత క్రేజ్

Mahayuti Alliance : షిండే, అజిత్ పవార్‌ల వెంటే మహా ప్రజలు.. పార్టీలను చీల్చినా ఎందుకింత క్రేజ్

Mahayuti Alliance : మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి విజయం సాధించి, సర్వే సంస్థల అంచనాల్ని నిజం చేసింది. అక్కడి షిండే నేతృత్వంలోని శివసేనా, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ ల తోడుగా ఎన్నికల బరిలో నిలచిన భారతీయ జనతా పార్టీ.. అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. గత ఐదేళ్లుగా పార్టీల అంతర్గాత వైరుద్యాలు, ఆధిపత్య పోరుల్లో నలుగుతున్న అక్కడి రాజకీయాలకు.. ఈ తీర్పు విస్పష్ట సంకేతంగా భావించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తరచి చూస్తే.. మహారాష్ట్ర ఫలితాల వెనుక అనేక రాజకీయ ఎత్తులు, వాటిపై ప్రజల తీర్పు స్పష్టంగా ఉందంటున్నారు.


మహారాష్ట్రలో ప్రజలు భాజపా కూటమికి విజయాన్ని అందించారు. అంతే కాదు.. ఏక్ నాథ షిండే, అజిత్ పవార్ ల వైపు మహారాష్ట్ర ప్రజలు నిలబడ్డారు. ఇప్పుడు.. ఈ నిర్ణయమే రాజకీయ నాయకులు చేసుకోవాల్సిన ఆత్మవిమర్శలకు కారణంగా నిలుస్తోంది. తాజా తీర్పుతో.. సిద్ధాంతాలను పక్కన పెట్టి తాత్కాలిక పదవుల కోసం వెళితే సహించమంటూ చెప్పారా.. కుటుంబ పార్టీల పట్ల ప్రజల్లో విసుగు కనిపించిందా.. అనే చర్చ నడుస్తోంది.

అధికారం కాదు సిద్ధాంతమే ముఖ్యం
మహారాష్ట్ర ఎన్నికల్లో బాలాసాహెబ్ ఠాక్రే ఓ విప్లవం. ఆయన ఆలోచన నుంచి ఉద్భవించిన శివసేన.. ఓ రాజకీయ పోరాట వేదిక. మహా ప్రజలకు హిందుత్వ పాఠాలు నేర్పిన బాలాసాహెబ్.. తన జీవిత చరమాంకం వరకు రాజకీయ పదవులకు దూరంగానే ఉన్నారు. ఆయన చివరిశ్వాస వరకు సిద్ధాంతాలకే కట్టుబడి పనిచేశారు. పార్టీని ఆ పునాదులపైనే నిర్మించారు. ఆ సిద్ధాంతాలకు ఆకర్షితులైన కోట్ల మంది ప్రజలు.. ఆ పార్టీకి అడుగడుగునా మద్ధతుగా నిలిచారు. ఏ స్థాయి ఎన్నికల్లో అయినా మద్ధతు ప్రకటించారు. శివసేనా వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ నుంచి ఆ పార్టీ చిట్టచివరి కార్యకర్త వరకు అందరికీ కాంగ్రెస్ సిద్ధాంత ప్రత్యర్థి. హిందూ ధర్మ రక్షణ కోసం శివసేనా నిలిస్తే.. ప్రజాస్వామ్యంలో అందరూ కావాలంటూ కాంగ్రెస్.. చెరోగట్టున చేరి రాజకీయాలు చేశాయి.


అలాంటి పార్టీ నుంచి వచ్చిన ఉద్ధవ్ ఠాక్రే.. బాలా సాహెబ్ మరణించిన వెంటనే అధికార పదవీ వ్యామోపం పట్టుకుంది. సీట్లు, పదవుల పేరుతో… సిద్ధాంత మైత్రి ఉన్న భాజపాతో వైరం పెంచుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. సుదీర్ఘకాలం శత్రుత్వం ఉన్న కాంగ్రెస్ తో చేతులు కలిపి అధికారం చేపట్టారు. అక్కడే.. సిద్దాంతాలకు ఉద్ధత్ తిలోదకాలు ఇచ్చారనే అభిప్రాయం మహారాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది.

ఏకంగా.. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలే ఎదురుతిరిగారు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో పార్టీని చీల్చి.. ఉద్దవ్ రాజకీయాలను ప్రశ్నించారు. తర్వాతి పరిణామాల్లో శివసేనా ఎన్నికల గుర్తు సైతం ఏక్ నాథ్ షిండే పక్షం కావడంతో.. ఉద్ధవ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అక్కడి నుంచి తనను అన్యాయం చేశారని, పార్టీకి తీరని ద్రోహం చేశారంటూ.. ఊరువాడ ప్రచారం చేశారు. ఆ విమర్శలకు తాజా ఎన్నికల తీర్పులో సమాధానం లభించింది అంటున్నారు. పార్టీల వెనుక నిలబడేది సిద్ధాంతం కోసమే కానీ.. తాత్కాలిక పదవుల కోసం కాదంటూ తేల్చి చెప్పేశారు. అంతే కాదు.. రెండేళ్ల మహాయుతి ప్రభుత్వంలో ఏక్ నాథ్ పెద్దగా సాధించిన విజయాలు ఏమీ లేవు. అయినా.. ఆయనపై మహారాష్ట్ర ప్రజలు బలంగా నిలుచున్నారు. ఉద్ధవ్ వర్గం చేసిన విమర్శలను లెక్కలోకి తీసుకోకుండా మద్ధతు ఇచ్చారు. ఈ నిర్ణయమే.. ఉద్దవ్ తో పాటు మిగతా రాజకీయ నేతలకు పెద్ద పాఠంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. వారసత్వం అంటే ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్లే వాళ్లే తప్పా.. పదవుల కోసం పాకులాడే వాళ్లను కాదని గట్టి సంకేతం ఇచ్చారు.

కుటుంబ రాజకీయాలకు గుడ్ బై..
మహారాష్ట్ర రాజకీయాల్లో శరత్ పవార్ శకానికి తాజా ఎన్నికల్లో ముగింపు పలికింది అనేది చాలా మంది మాట. దశాబ్దాలుగా మహా ఎన్నికల్లో సత్తా చాటుతున్నా.. ఈ సారి ఎన్నికల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తన తమ్ముడి కొడుకు.. అజిత్ పవార్ ఎన్సీపీ కి ప్రజలు పట్టం కట్టడంతో ఇక శరత్ పవార్ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే భావిస్తున్నారు. ఇప్పటికే.. ఇవే తనకు చివరి ఎన్నికలని శరత్ ప్రకటించినా.. పెద్దగా జనం అంగీకరించలేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో శరత్ ఇంకా క్రియాశీలక రాజకీయాల్లో ఉండే అవకాశాలు లేవు. అయితే.. శరత్ కు మొండి చెయ్యి చూపిన ప్రజలు అజిత్ పవార్ కు మాత్రం సపోర్టుగా నిలిచారు.

Also Read : విజయం సరే.. అసలు సమస్య ఇదే, సీఎం అయ్యేది ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఏక్ నాథ్ షిండే?

ఈ పరిణామాలు పరిశీలిస్తే.. చీలిక రాజకీయాలను సైతం ప్రజలు అంగీకరిస్తారని అంటున్నారు. ఏదైనా బలమైన కారణంతో పార్టీని చీల్చినా, అసలు నాయకులకే ఎదురు నిలిచి పార్టీ గుర్తుల్ని తీసేసున్నా సరే.. ప్రజలు మాత్రం ఎటువంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. గతంలో తెలుగురాష్ట్రాల్లో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని, ఎన్నికల గుర్తుల్ని తీసుకున్నప్పుడు సైతం.. సహేతుక కారణాలున్నాయంటూ ప్రజలు చంద్రబాబుకు మద్ధతు ప్రకటించారు. అప్పటి నుంచి.. ఇప్పటి వరకు పార్టీని, నాయకుడిని గౌరవిస్తున్నారు. అచ్చంగా.. అలాంటి పరిణామమే.. మహారాష్ట్రలోనూ రిపీటైంది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×