IPL Auction 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు ( IPL Auction 2025 ) సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక నవంబర్ 24వ తేదీ అంటే రేపటి నుంచి మెగా వేలం నిర్వహించనున్నారు. ఆదివారం అలాగే సోమవారం రెండు రోజులపాటు ఐపిఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో 10 ఫ్రాంచైజీలు ఏ ప్లేయర్లను కొనుగోలు చేయాలి? ఎవరికి ఎంత ధర పెట్టాలి అనే దానిపై కసరత్తులు చేస్తున్నాయి. రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు… ప్రారంభం కానుంది. IPL Auction 2025
ఈ నేపథ్యంలో… టీమిండియా కు సంబంధించిన వికెట్ కీపర్ ల పై అందరికి కన్ను పడింది. అందులో ముందు వరుసలో ఉన్నారు రిషబ్ పంత్. మొన్నటి సీజన్… వరకు… ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరించారు. అయితే యాజమాన్యం కొన్ని… ఆంక్షలు పెట్టడంతో ఢిల్లీ జట్టును వదిలేశాడు రిషబ్ పంత్ (rISHABH pANT) . దీంతో ఈసారి వేలంలోకి వస్తున్నాడు. ఈ తరుణంలోనే ఇతనిపై.. 30 కోట్లు పెట్టేందుకు చాలా జట్లు రెడీగా ఉన్నాయి.
Also Read: IND vs Aus BGT Trophy: బుమ్రా దెబ్బకు 104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్..!
పంజాబ్ కింగ్స్ ఇతని కొనుగోలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (KL RAHUL). లక్నోను.. వదిలేసిన కేఎల్ రాహుల్… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వైపు చూస్తున్నాడు. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యంతో చర్చలు జరిగాయట. వేలంలోకి రాగానే కొనుగోలు చేయాలని ఆ జట్టు యాజమాన్యం చూస్తోంది.
ఇక మరొక వికెట్ కీపర్… ఇషాన్ కిషన్ (ISHAN KISHAN). ఇతనిపై 14 కోట్ల వరకు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ ఇతన్ని… పెంచి పోషించింది. ఈ సారి వేలంలోకి వస్తున్నాడు. ఆర్టీఎం కార్డు ద్వారా మళ్ళీ ముంబై కొనుగోలు చేసే అవకాశాలతో పాటు… చెన్నై సూపర్ కింగ్స్ ఇతన్ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
Also Read: Bumrah – Kapil Dev: ఆసీస్ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా చరిత్ర..కపిల్ దేవ్ రికార్డు బ్రేక్ !
ఇక జితేష్ శర్మ పైన (JITESH KUMAR) కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు పంజాబ్ కింగ్స్ కు ఆడిన జితేష్… ఇప్పుడు వేలంలోకి రాబోతున్నాడు. ఇక మరొక డేంజర్ వికెట్ కీపర్ జాస్ బట్లర్ ( JOS BUTTLER)… కోసమైతే అన్ని జట్లు ఎగబడుతున్నాయి. అతనిపై 20 కోట్లు పెట్టేందుకు కూడా రెడీగా ఉన్నాయి. మొన్నటి వరకు రాజస్థాన్ రాయల్స్ తరఫున… జాస్ బట్లర్ ఆడాడు. బట్లర్ ను…. కేకేఆర్ జట్టు కొనుగోలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్లు వదులుకుంటే… లక్నో కూడా ఎగిరేసుకుపోయే ఛాన్స్ ఉంది.