BigTV English

CM Revanth Chitchat with Media: ఫోన్ ట్యాపింగ్ పై మౌనమెందుకు..? మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Chitchat with Media: ఫోన్ ట్యాపింగ్ పై మౌనమెందుకు..? మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Chitchat with Media: తెలంగాణలో విద్యుత్ సమస్య లేదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. విద్యుత్ వినియోగం పెరగడంతో సరఫరాలో కొన్నిచోట్ల అవాంతరాలు ఏర్పడుతోందన్నారు. పనిలోపనిగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, అక్కడి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలను వెల్లడించారు.


చీటికి మాటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని అన్నారు. ఎందుకు సీబీఐ విచారణ కోరలేదన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చామన్నారు.  మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయలేదని, ఆ అవసరంలేదని మాకు లేదన్నారు. ట్యాపింగ్ లాంటి వెదవ పనులు తాము చేయమని చెప్పుకొచ్చారు.

అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అవన్నీ చర్చిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో అనేక విమర్శలు, ఆరోపణలతో అధికారుల బదిలీలు జరిగాయన్నారు. తెలంగాణలో అలాంటి ఆరోపణలకు ఏమాత్రం తావులేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిఫుణులు చెప్పింది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దాని ఆధారంగానే ముందుకు వెళ్తామన్నారు. అత్యంత పాదర్శకంగా తమ పాలన సాగుతోందన్న సీఎం రేవంత్, ఈ విషయంలో ప్రత్యర్థి పార్టీలు విమర్శించే అవకాశం లేదన్నారు.


Also Read: ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు.. మరి కాసేపట్లో పేలిపోతుందంటూ..

తెలంగాణ గేయానికి సంబంధించిన పనులను వేరేవాళ్లకు అప్పగించడంపై వస్తున్న విమర్శలపైనా మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ గేయానికి సంబంధించిన పనులను అందెశ్రీ అప్పగించామన్నా రు. ఎవర్ని తీసుకుంటారనేది ఆయన ఇష్టమన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం రూపకల్పన రుద్ర రాజేశంకి ఇచ్చామన్నారు. తెలంగాణ అంటే రాచరికానికి వ్యతిరేకమని, త్యాగాలు పోరాటాలు గుర్తుకు వస్తాయన్నారు. అవి గుర్తుకు వచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని తెలియజేశారు. మిగతా విషయాల్లో తాను జోక్యం చేసుకోనన్నారు సీఎం.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×