E-Paper
Advertisement

Anand Movie Fame Hero Raja: ఆనంద్ హీరో రాజా గుర్తున్నాడా..? సినిమాలు మానేసి ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకే!

Anand Movie Fame Hero Raja: ఆనంద్ హీరో రాజా గుర్తున్నాడా..? సినిమాలు మానేసి ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకే!
Advertisement

Anand Movie Fame Hero Raja: ఆనంద్.. ఒక మంచి కాఫీ లాంటి అబ్బాయి. ఈ డైలాగ్ వినగానే ఆనంద్ సినిమా గుర్తొస్తుంది. శేఖర్ కమ్ముల అందించిన ఆణిముత్యాలాంటి సినిమాల్లో ఆనంద్ ఒకటి. ఈ సినిమాలోని హీరో రాజా. ఇప్పడూ సినిమాలకు దూరమైన అతను ఏం చేస్తున్నాడు.. ? ఎలా ఉన్నాడు.. ? అని అందరు ఎంతగానో ఆసక్తిగా వెతుకుతున్నారు. రాజా జీవితం పూలపాన్పు కాదు.

14 ఏళ్ల వయస్సులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. తండ్రి కన్నా ముందే తల్లి క్యాన్సర్ తో చనిపోయింది. ఇక ఎవరు లేని రాజా ఒక్కడే జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అక్కలు ఉన్నా వారు కూడా ఒంటరివాళ్ళ. దీంతో రాజా డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. స్నేహితులు కాపాడి ధైర్యం చెప్పడంతో కోలుకున్నాడు. ఆ తరువాత కష్టపడి చదువుకొని అమెరికాలో ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ అయ్యి మంచిగా డబ్బు సంపాదించాడు.

Advertisement

రెండున్నరేళ్ళుగా చేస్తున్న ఉద్యోగం వదిలేసి అమెరికా వెళ్ళి థియేటర్ యాక్టింగ్ కోర్సులో చేరాడు. అది పూర్తి చేసుకుని స్వదేశానికి చాలా ఆత్మవిశ్వాసంతో తిరిగివచ్చాడు. ఫోటోలను, సర్టిఫికేట్లను చేతపట్టుకుని నిర్మాతల చుట్టూ తిరిగాడు. రకరకాల అనుభవాలను ఎదుర్కొన్నాడు. అవకాశాలు మాత్రం రాలేదు. కొద్ది కాలం తర్వాత విసిగిపోయి ముంబై వెళ్ళి మోడలింగ్ అవకాశాల కోసం అన్వేషించాడు. వీడియో ఆల్బమ్స్ లోనూ, నాటకాల్లోనూ నటించాడు. ఆ సమయంలోనే ఒకసారి సికింద్రాబాద్ క్లబ్‌లో నాటకం వేయడానికి వచ్చి పాత్రికేయుల కళ్ళలో పడ్డాడు. అలా అతనికి ఓ చినదానా సినిమా అవకాశం వచ్చింది. సెకండ్ హీరోగా చేసినా మంచి విజయమే దక్కింది.

Also Read: Balayya Strange Behavior: మందేసి నటి అంజలిని స్టేజ్‌ పై తోసేసిన బాలయ్య బాబు.. ఇదిగో వీడియో

Advertisement

ఇక రాజా జీవితాన్నీ మార్చిన సినిమా ఆనంద్. ఈ సినిమా అతడికి స్టార్ హోదాను తీసుకొచ్చి పెట్టింది. ఆనంద్ తరువాత అప్పుడప్పుడు, మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు, మిస్టర్ మేధావి, ఆ నలుగురు, కోకిల ఇలాంటి సినిమాలు చేశాడు. ఈ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. దీంతో రాజా సినిమాలకు స్వస్తి పలికాడు. కొన్నేళ్లు ఎక్కడా కనిపించని రాజా.. హఠాత్తుగా ఒక చర్చ్ లో ఫాస్టర్ గా మారి కనిపించాడు. 2014 లో రాజా ఫాస్టర్ గా మారినట్లు తెలుస్తోంది.

దేవుని గురించిప్రచారం చేస్తూ కనిపించాడు. రాజా తండ్రి బ్రాహ్మణడు.. తల్లి క్రిస్టియన్. తన తల్లి లానే తాను కూడా క్రిస్టియన్ గా మారినట్లు ఆయన తెలిపాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఒక చర్చ్ పాస్టర్ గా చేస్తున్నారు. ఈ మధ్యనే పరిచర్య కోసం అమెరికా వెళ్లినట్లు ఆయన ఒక వీడియో ద్వారా తెలిపాడు. ఒకప్పుడు స్టార్ హీరో.. ఇప్పుడు ఫాస్టర్ గా మారాడని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×