BigTV English

Kodali Nani : తెలంగాణలో జనసేన పరిస్థితి చూశాం.. ఇక ఏపీలోనూ అంతే : కొడాలి నాని

Kodali Nani | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ పొత్తు పెట్టుకున్నజనసేన పరిస్థితి చూశాం.. ఇక ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. జనసేన పరిస్థితి మళ్లీ అలాగే ఉంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. టిడిపికి ప్రతిపక్షం హోదా కోసం చంద్రబాబు జనసేనతో పొత్తుపెట్టుకున్నారని.. అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వడానికే టిడిపీతో పొత్తు పెట్టుకున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Kodali Nani : తెలంగాణలో జనసేన పరిస్థితి చూశాం.. ఇక ఏపీలోనూ అంతే : కొడాలి నాని
Kodali Nani latest comments

Kodali Nani latest comments(AP Politics):

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ పొత్తు పెట్టుకున్నజనసేన పరిస్థితి చూశాం.. ఇక ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. జనసేన పరిస్థితి మళ్లీ అలాగే ఉంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. టిడిపికి ప్రతిపక్షం హోదా కోసం చంద్రబాబు జనసేనతో పొత్తుపెట్టుకున్నారని.. అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వడానికే టిడిపీతో పొత్తు పెట్టుకున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.


పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ కలిసి సిఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరంటూ ఘూటుగా మాట్లాడారు. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సింహం లాగా సింగిల్ గా వస్తారు.. కానీ చంద్రబాబు ఒక మోసగాడు ఆయన అధికారంలోకి రావడమనేది జరగదు అని ఆయన చెప్పారు.

సిఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చారని.. ఆయనపై ప్రజలకు ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిస్తే ఇక్కడ టిడిపి సంబరాలు చేసుకుంటోంది.. అదే ఓడిపోతే తమకు సంబంధం లేదని చెప్పటం టిడిపికి అలవాటని దుయ్యబట్టారు.


హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్స్ ఓట్లతో కేసీఆర్‌ను ఓడిస్తామని టిడిపి నేతలు చెప్పారు… కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు అయినా గెలిచిందా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారు.. అలాంటి పార్టీ జెండాతో గాంధీభవన్‌ వద్ద టిడిపి వర్గాలు కాంగ్రెస్ గెలిస్తే గంతులేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ ఇద్దరూ చంద్రబాబు శిష్యులే.. అలాంటిది శిష్యులు ముఖ్యమంత్రులు అవుతున్నారు కానీ చంద్రబాబు పరిస్థితి ఏంటని సెటైర్లు వేశారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×