Big Stories

CM Revanth Reddy: ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా.. ప్రధానిగా రాహుల్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ గెలుపు తథ్యం అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం చాలా అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

మహబూబాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పై మండిపడ్డారు. విభజన హామీలను బీజేపీ సర్కార్ పక్కన పెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని గద్దె దించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

విభజన హామీల్లో భాగంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోట్ ఫ్యాక్టరీలను తెలంగాణను కేటాయించాలని.. వాటిని ఇంకా ఎందుకు ఇవ్వలేదని బీజేపీని ప్రశ్నించారు. కుంభమేళాలకు రూ.వేల కోట్లను ఖర్చు చేసిన మోదీ సర్కార్.. రాష్ట్రంలో జరిగే మేడారం జాతరకు రు.3కోట్లు మాత్రమే కేటాయించిందని దుయ్యబట్టారు.

రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రజలు బండకేసి కొట్టారని అన్నారు. కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News