Tirumala: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీత, కుమార్తె, అల్లుడు, మనవడు, తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికి తగిన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత గర్భాలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం పూజారులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు.