Smoothies For Hair Growth: పండ్లతో తయారు చేసిన స్మూతీలు జుట్టు పెరుగుదలకు చాలా మేలు చేస్తాయి. ఇవి మూలాల నుంచి జుట్టుకు పోషణను అందించి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. పండ్లతో తయారు చేసిన స్మూతీస్ ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టును మూలాల నుండి వాటిని బలోపేతం చేస్తాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడే స్మూతీస్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వివిధ పోషక గుణాలు పుష్కలంగా ఉన్న స్మూతీలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా వాటిలో ఉండే విటమిన్ ఎ, సి, ఇ , ప్రోటీన్లు జుట్టు మూలాలకు తగిన పోషణను అందించడం ద్వారా వాటి పెరుగుదలను మెరుగుపరుస్తాయి. అందుకే రోజువారీ దినచర్యలో వివిధ రకాల పండ్లు, కూరగాయలతో తయారు చేసిన ఈ స్మూతీస్ త్రాగడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.
1. బెర్రీ, బనానా స్మూతీ:
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, అరటిపండు, కొబ్బరి నీళ్లతో స్మూతీ తయారు చేసుకుని త్రాగాలి. బెర్రీస్, అరటిపండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా వాటిని బలోపేతం చేస్తాయి.
2. అవకాడో, దోసకాయ స్మూతీ:
బచ్చలికూర, కొబ్బరి నీరు, వేయించిన జీలకర్ర పొడి, నల్ల మిరియాల పొడి, ఉప్పు , నిమ్మరసం కలిపి మీ టేస్ట్ ప్రకారం స్మూతీ తయారుచేసుకుని త్రాగండి. ఇందులోని అవకాడో , దోసకాయలో విటమిన్-ఇ , హైడ్రేషన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టును మూలం నుంచి కొనల వరకు తేమగా మారుస్తుంది.
3. మామిడి, స్ట్రాబెర్రీ స్మూతీ:
మామిడి పండు, స్ట్రాబెర్రీ,పెరుగు, తేనెతో స్మూతీని తయారు చేసుకోండి. విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండే ఈ స్మూతీస్ జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తాయి. అంతే కాకుండా జుట్టును మృదువుగా, దృఢంగా చేస్తాయి .
4. మెంతి స్మూతీ:
మెంతి ఆకులు,పెరుగు,తేనెతో తయారు స్మూతీ తయారు చేసుకుని తరుచుగా త్రాగండి మెంతికూరలో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను పెంచుతుంది.
Also Read: నిద్రపోతున్నప్పుడు మీరు చేసే ఈ పొరపాట్ల వల్ల జుట్టు రాలుతుందని మీకు తెలుసా ?
5. క్యారెట్-ఆరెంజ్ స్మూతీ:
క్యారెట్, నారింజ,అల్లం, తేనె, నల్ల మిరియాల పొడి,వేయించిన జీలకర్ర పొడి , ఉప్పు నీరు వేసి స్మూతీ తయారు చేసుకుని త్రాగండి. క్యారెట్, నారింజలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయి.
6. కివి, బొప్పాయి స్మూతీ:
కివి, బొప్పాయి, కొబ్బరి నీటితో కలిపి స్మూతీ తయారు చేయండి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ స్మూతీస్ జుట్టుకు పూర్తి పోషణను అందిస్తాయి.
7. బీట్‌రూట్, దానిమ్మ స్మూతీ:
బీట్‌రూట్, దానిమ్మ, పెరుగు, కాస్త నీటితో స్మూతీని తయారు చేయండి. దీనిని తరుచుగా త్రాగడం వల్ల ఇందులోని పోషకాలు జుట్టును పెరిగేలా చేస్తాయి. అంతే కాకుండా జుట్టుకు పోషణను అందిస్తాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.