Big Stories

CM Revanth Reddy : ‘ఈ ఎన్నికలు తెలంగాణ – గుజరాత్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ లాంటివి’

CM Revanth Reddy: ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ – గుజరాత్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ లాంటివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీని డకౌట్‌ చేసి.. గుజరాత్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పదేళ్లపాటు రాష్ట్రంలో విధ్వసం సృష్టించిన కేసీఆర్ పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం పేర్కొన్న పరిశ్రమలు, ప్రాజెక్టులను మోదీ సర్కారు రద్దు చేసిందని రేవంత్ గుర్తు చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని విభజన చట్టంలో ఉన్నాయన్నారు.

- Advertisement -

వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా హనుమకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై మండిపడ్డారు. నిరంకుశ పాలనపై పదేళ్లపాటు పోరాడి తాను సీఎం కుర్చీలోకి వచ్చానని అన్నారు. ఉద్యమం పేరిట తాను అమాయకులైన పిల్లల్ని చంపి అధికారంలోకి రాలేదని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు.

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ లో మార్పు వస్తుందని ఆశించానని.. కానీ అది ఎక్కడా కనిపించలేదన్నారు. రైతులకు క్షమాపణలు చెప్పి ఓట్లు అడుగుతారని ఆశించినా సరే ఫలితం లేదన్నారు. కేసీఆర్ తన కూతురు కవిత బెయిల్ కోసం బీజేపీకి ఎంపీ సీట్లను తాకట్టుపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే ఈ ఎన్నికలు తెలంగాణ-గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ లాంటివని.. బీజేపీని డకౌట్ చేసి గుజరాత్ ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News