BigTV English

CM Revanth Reddy: అక్షరం ముక్క రానివాడు కూడా జర్నలిస్ట్.. వేదిక దిగి కొట్టాలనిపిస్తది: సీఎం రేవంత్

CM Revanth Reddy: అక్షరం ముక్క రానివాడు కూడా జర్నలిస్ట్.. వేదిక దిగి కొట్టాలనిపిస్తది: సీఎం రేవంత్

CM Revanth Reddy: జర్నలిస్ట్.. పాత్రికేయులు.. రిపోర్టర్.. ప్రస్తుత సమాజంలో అసలు నిజమైన జర్నలిస్ట్ ఎవరు..? ఫేక్ జర్నలిస్ట్ ఎవరు..? అనేది తెలియని పరిస్థితి నెలకొంది.  వార్తలను, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించేవారు జర్నలిస్టులు.. ఒకప్పుడు సమాజంలో నిఖార్సయిన జర్నలిస్టులు ఉండేవారు.. ఇప్పటికీ ఉన్నారు.. కానీ ఎవరూ నిజమైన జర్నలిస్టులు.. ఎవరూ ఫేక్ జర్నలిస్టులు అనేది అంతుపట్టడం లేదు. సోషల్ మీడియా పేరుతో జర్నలిస్ట్ అనే పేరుకే అర్థం లేకుండా చేస్తున్నారు. యూట్యూబ్ లో ఒక్కపేరు పెట్టుకుని వారికి నచ్చిన వార్తలను పోస్ట్ చేస్తూ.. మేమే జర్నలిస్టులం అనే చెప్పుకునే వారు రాష్ట్రంలో వేలల్లో ఉన్నారు.. సమాజంలో ఫేక్ జర్నలిస్టులు సమాచార వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదకరమైన శక్తిగా మారుతున్నారు. ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. వారి ప్రధాన లక్ష్యం ఏదైనా పార్టీకి రాజకీయ ప్రయోజనాలను చేకూర్చడం లేదా.. సమాజంలో గందరగోళం సృష్టించడం. ఫేక్ జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి తప్పుడు వార్తలను వేగంగా వ్యాప్తి చేస్తున్నారు.. దీని వల్ల ప్రజలు గందరగోళానికి గురి కావాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఫేక్ జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.


జర్నలిస్టుల నాలెడ్జ్ ప్రజలకు ఉపయోగపడాలి…

‘నాకు అప్పుడప్పుడు కొందరి తీరు చూస్తే.. స్టేజీ దిగి పళ్ల పళ్ల చెంపలపై కొట్టాలని అనిపిస్తది.. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటయ్.. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి.. పలకరించి మాట్లాడేది.. మేం చెబుతున్న మాటల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా..? అని వారితో డిస్కస్ చేసేది. మా ఉద్దేశం ఏంటి అనేది వారికి వివరించేది.. విద్యుత్ పైన మాట్లాడాలని అనుకుంటే.. గతంలో చాలా సార్లు జర్నలిస్టులతో మాట్లాడేది.. ఏమైనా సందేహాలు ఉంటే జర్నలిస్టులను అడిగేది.. జర్నలిస్టుల నాలెడ్జ్ ప్రజలకు ఉపయోగపడాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


ఫేక్ జర్నలిస్టులను గుర్తించాలి…

‘ప్రస్తుత రోజుల్లో ఎవరు చూసిన సోషల్ మీడియా జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు.. ఇలాంటి వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తొడైనయ్.. మీడియా వ్యవస్థను కొన్ని పార్టీలు నాశనం చేస్తున్నాయ్.. కొన్ని పార్టీలు ఏర్పాటు చేసుకున్న మీడియా సంస్థల వల్ల జర్నలిస్టుల విశ్వసనీయత వేగంగా సన్నగిల్లుతోంది. అందుకే ఇప్పుడు నిబద్ధత గల జర్నలిస్టులు అందరూ ఒక్క వేదికపైకి వచ్చి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన జర్నలిస్టులు ఒకవైపు.. జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వారికి మరొకవైపు నెట్టాల్సిన అవసరం ఉంది’ సీఎం చెప్పుకొచ్చారు.

వారితో దేశానికే ప్రమాదం…

ఫేక్ జర్నలిస్టులను గుర్తించకపోతే.. మీడియా సంస్థలకే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి, దేశ భద్రతకు ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.నాకు జర్నలిస్టులు అంటే చాలా గౌరవం ఉంది. వారి రాసే వార్త కథనాలు ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతాయి. విశ్లేషించి రాసినప్పుడు ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేస్తోంది..? పథకాలు సరిగ్గా అమలు అవుతున్నాయా..? అనేది క్లియర్ కట్ గా తెలుస్తది.. ఇప్పటికైనా జర్నలిస్టుల ముసుగులో ఎవరూ తప్పులు చేయొద్దు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related News

Congress: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

KTR In Delhi: కేటీఆర్ ఢిల్లీ ముచ్చట్లు.. ఆ భేటీ ఉద్దేశమేంటి?

KCR Big Sketch: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?

Farmers: సొంత భూమి ఉంటే చాలన్నా.. సింపుల్‌గా రూ.50వేలు పొందండిలా..?

Chiranjeevi: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో చిరంజీవి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేటీఆర్

Big Stories

×