BigTV English

Patanjali Cycle: పతంజలి ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేసింది.. దీని ధర, ప్రత్యేకతలు ఇవే!

Patanjali Cycle: పతంజలి ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేసింది.. దీని ధర, ప్రత్యేకతలు ఇవే!


Patanjali Cycle: ఇంధన ధరలు రోజురోజుకు పెరిగిపోతుండగా, ప్రజలు మరింత దగ్గరగా పర్యావరణ హితం కోసం ఆలోచిస్తున్నారు. అలాంటి సమయంలో ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గుతున్నారు. స్కూటర్లు, కార్లు తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిళ్లు ఒక కొత్త పరిష్కారంగా మారుతున్నాయి. ఇక ఇప్పుడు పతంజలి సంస్థ సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసింది. ఆయుర్వేదం, సహజమైన జీవన శైలిని ప్రోత్సహించే పతంజలి, ఇప్పుడు “పతంజలి ఎలక్ట్రిక్ సైకిల్”తో మొట్టమొదటి సారిగా ప్రయోగాత్మకంగా ముందుకొస్తోంది.

ఈ సైకిల్ రూపకల్పనలో ఆధునిక సాంకేతికతతో పాటు, ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. దానికితోడు పర్యావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడే లక్ష్యంతో రూపొందించారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరను తక్కువగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ముందుగా వచ్చిన నివేదికల ప్రకారం, ఈ సైకిల్ ధరను ₹5,000గా నిర్ణయించనుందనే వార్తలు వచ్చినా, పతంజలి నుండి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. అయితే, గతంలో పటంజలి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ₹14,000కి విడుదల చేసిన దృష్ట్యా, ఈ సైకిల్ ధర కూడా తక్కువగా ఉండే అవకాశమే ఎక్కువ.


పతంజలి ఎలక్ట్రిక్ సైకిల్ బెనిఫిట్స్ ఇలా..

పతంజలి ఎలక్ట్రిక్ సైకిల్ రూపకల్పన పరంగా చూస్తే, దీని ఫ్రేమ్ తేలికగా ఉండి, స్టీల్ లేదా అల్యూమినియం మిశ్రమంతో తయారు అవుతుంది. దీని రూపం సింపుల్ అయినా ఆకర్షణీయంగా ఉంటుంది. తెలుపు, ఆకుపచ్చ, నలుపు రంగులలో లభించవచ్చు. సీటు కంఫర్ట్‌గా ఉండి, హ్యాండిల్స్ కూడా సులువుగా ఉపయోగించుకునేలా ఉంటాయి. కొన్ని మోడళ్ళు మడిచేలా కూడా తయారయ్యే అవకాశం ఉంది. పంక్చర్ రెసిస్టెంట్ ఫీచర్ తో టైర్లు స్టాండర్డ్ 26 అంగుళాలవిగా ఉండే అవకాశం ఉంది. ఇది 250 నుండి 350 వాట్స్ మధ్య పవర్ కలిగిన బ్రష్‌లెస్ DC మోటార్‌తో వస్తుంది. దీని బ్యాటరీ లిథియం-అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీ. సామాన్యంగా ఇది 36 వోల్ట్, 10Ah సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 30 నుండి 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఛార్జ్ చేయడానికి 4 నుండి 6 గంటలు పడుతుంది. గంటకు 25 నుండి 30 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు.

బ్యాటరీ రేంజ్ గురించి కంపెనీ  ప్రకటన లేదు..

దీనిలో పెడల్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉంటుంది. అంటే మీరు స్వయంగా పెడల్ తిప్పితే, మోటార్ అలా పనిచేసి సహాయం చేస్తుంది. కొన్నిసార్లు throttle ఉన్న మోడళ్ళు కూడా ఉండవచ్చు. ఇవి పూర్తిగా పెడల్ లేకుండా కూడా నడిపించుకోవచ్చు. డిస్‌ప్లే ప్యానెల్ ద్వారా మీరు వేగం, బ్యాటరీ స్థాయి, దూరం వంటి వివరాలు చూసుకోవచ్చు. 6 లేదా 7 స్పీడ్ గియర్లతో వస్తే ఎటువంటి ప్రాంతాల్లోనైనా సులభంగా ప్రయాణించవచ్చు. బ్రేకింగ్ సిస్టమ్‌కి సంబంధించి డిస్క్ బ్రేక్స్ లేదా V బ్రేక్స్ ఉండే అవకాశం ఉంది. రాత్రివేళ ప్రయాణానికి ముందు LED లైటు, వెనుక టైల్ లైటు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే మడ్‌గార్డులు, కిక్స్టాండ్, బాస్కెట్ వంటివి కూడా అదనంగా అందిస్తారు. ఇంకా బ్యాటరీ రేంజ్ గురించి కంపెనీ ఖచ్చితంగా ప్రకటించలేదు. కానీ మిగతా బ్రాండ్స్ చూస్తే, అలాంటి స్పెసిఫికేషన్ కలిగిన సైకిళ్లు 30 నుండి 60 కిలోమీటర్ల వరకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే నడిచే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అందుకే, పతంజలి సైకిల్ కూడా సాధారణ రోజువారీ ప్రయాణానికి చక్కగా ఉపయోగపడుతుంది.

వివరాలు న్ లైన్ వెబ్ సైట్ ద్వారా..

ఈ సైకిల్‌ను కొనాలంటే ఇప్పుడు అధికారికంగా ఏ ఆన్‌లైన్ వెబ్‌సైట్ లేదా బుకింగ్ పోర్టల్ మాత్రం లేదు. కానీ మీరు పతంజలి అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళి, కస్టమర్ కేర్‌కి సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. స్థానిక పతంజలి స్టోర్లను సంప్రదించటం ద్వారా కూడా బుకింగ్ వివరాలు లేదా అందుబాటులో ఉన్న సైకిళ్లు ఉన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. పతంజలి ఎలక్ట్రిక్ సైకిల్ అన్నది పర్యావరణ పరిరక్షణతో పాటు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడిన ఒక వినూత్న ఆవిష్కరణ. భారతీయ మార్కెట్లో ఇది ఒక పెద్ద విప్లవానికి నాంది కావచ్చు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పతంజలి చేసే ప్రయోగాలు, తద్వారా సాధించదలిచిన లక్ష్యాలు మనదేశపు భవిష్యత్ రవాణా విధానాలను మార్చే అవకాశం ఉంది.

Related News

Bank Holidays: ఏంటీ ఆ మూడు రోజులు బ్యాంక్ పనిచేయవా.. ముందుగా ప్లాన్ చేసుకోండి ఇలా..

Jio Mart vs D-Mart: రిలయన్స్ ఫ్రెష్, డి-మార్ట్.. దేనిలో ధరలు తక్కువ, ఎందుకు?

Gold Mines: ఆ ప్రాంతంలో లక్షల టన్నుల బంగారం.. తవ్వే కొద్ది బయటపడుతోన్న గోల్డ్.. ఎక్కడో తెలుసా?

Jio Offers: ఎగిరి గంతేసే వార్త.. జియో తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్

D-Mart: డి-మార్ట్‌ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?

PAN 2.0: పాన్ 2.0.. అప్‌డేట్ వెర్షన్, అయితే ఏంటి?

Big Stories

×