IRCTC – Aadhaar: టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక చర్యలు చేపడుతోంది. నిజమైన ప్రయాణీకులే టికెట్లు బుక్ చేసుకునే జాగ్రత్తలు తీసుకుంటుంది. జూలై 1 నుంచి తత్కాల్ రైలు టికెట్ బుకింగ్స్ కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తాజాగా తత్కాల్ బుకింగ్స్ కు సంబంధించి పార్లమెంట్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు.
ఆధార్ తో లింక్ చేయబడిన IRCTC వినియోగదారులకు ప్రాధాన్యత
తాజా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో, 11 మంది రాజ్యసభ రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థ గురించి పలు ప్రశ్నలు అడిగారు. “తత్కాల్ టికెట్ బుకింగ్‌లకు ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ తప్పనిసరి అవుతుందా? ఆధార్-లింక్డ్ IRCTC ఖాతాలు ఉన్న ప్రయాణీకులకు బుకింగ్ లో ప్రాధాన్యత లభిస్తుందా? అనే అంశాలపై వివరణ కోరారు. ఏజెంట్లు, టౌట్ లు తత్కాల్ టికెట్లను దుర్వినియోగం చేయడాన్ని అరికట్టడానికి ఈ చర్యలు ఎలా సహాయపడతాయి?” అనే ప్రశ్నలు వేశారు.
సభ్యుల ప్రశ్నలకు మంత్రి వైష్ణవ్ పూర్తి వివరాలు వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి కొత్త తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. తత్కాల్ పథకం కింద టికెట్లను ఆధార్ ప్రామాణీకరించిన వినియోగదారులు మాత్రమే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) యాప్, వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని అన్నారు. తత్కాల్ బుకింగ్ ARP తొలి 30 నిమిషాలలో ఏజెంట్లు టిక్కెట్లు బుక్ చేసుకోకుండా నిషేధించబడ్డారని ఆయన వెల్లడించారు. తాజా నిర్ణయాలతో నకిలీ ఖాతాలను ఉపయోగించి ఎక్కువ బుకింగ్‌లకు పాల్పడే వారికి అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు. వివిధ ప్లాట్ ఫామ్ లలో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా తత్కాల్ టికెట్ల బుకింగ్ లో పారదర్శకతను నిర్ధారించడానికి చర్యలు తీసుకునే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని మంత్రి సమాధానమిచ్చారు.
ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్
తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం భారతీయ రైల్వే ప్రయాణానికి ఒకరోజు ముందు అవకాశాన్ని కల్పిస్తోంది. సవరించిన నిబంధనల ప్రకారం, AC తరగతులకు ఉదయం 10:00 నుండి 10:30 వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది. నాన్ ఏసీ తరగతులకు ఉదయం 11 నుండి 11:30 వరకు అవకాశం కల్పిస్తుంది.
Read Also: భారత్ లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ వెరీ వెరీ స్పెషల్, ఎందుకో తెలుసా?
తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఓటీపీ తప్పనిసరి
కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లలో, అధీకృత ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న తత్కాల్ టికెట్లకు బుకింగ్ సమయంలో వినియోగదారు అందించిన మొబైల్ నంబర్‌కు OTP ప్రామాణీకరణ పంపడం కచ్చితంగా అవసరం అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Read Also: ప్రపంచంలో భయంకరమైన రైల్వే స్టేషన్లు, ధైర్యం ఉంటేనే వెళ్లండి బాస్!