BigTV English
Advertisement

CM Revanth Reddy: తుపాను బాధితులను ఆదుకోవడంలో అన్ని రకాలుగా సిద్ధం.. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తుపాను బాధితులను ఆదుకోవడంలో అన్ని రకాలుగా సిద్ధం.. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో తీసుకున్న చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణ, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.


ప్రతి 24 గంటలకు ఒక నివేదిక

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో తీసుకోవలసిన చర్యలపై సీఎం అధికారులకు సూచనలిచ్చారు. అధికారుల సెలవులను రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి ప్రతి 24 గంటల పరిస్థితిపై రోజువారీగా కలెక్టర్లకు నివేదికలు అందించాలని చెప్పారు. నివేదికలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం సేకరణలో పౌర సరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు పరిస్థితులను వివరిస్తూ అవసరమైన సూచనలు చేయాలన్నారు.

ధాన్యాన్ని ఫంక్షన్ హాళ్లకు తరలించండి

వరి కోతల కాలంలో తుపాను కారణంగా అనుకోని ఉపద్రవం రైతుల్లో తీవ్ర ఆవేదన మిగుల్చుతుందని, ఇలాంటి సందర్భాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాళ్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని, పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా ఒక మానిటరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు.


Also Read: Hyderabad Traffic Diversions: హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపు, ఆ మార్గాలపై సూచనలు

ఎక్కడా ప్రాణనష్టం జరక్కుండా చర్యలు

ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సహాయక చర్యలను ఎలాంటి లోటు లేకుండా, ఎక్కడా ప్రాణ నష్టం జరక్కుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను మళ్లించాలని, ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లోలెవల్ కల్వర్టుల వద్ద పరిస్థితిపై స్థానికులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పారు.

Related News

TG Govt Schools: గురుకుల, కేజీబీవీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెండింగ్ బకాయిలు మొత్తం క్లియర్

Hydraa: రూ. 111 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా.. స్థానికులు హర్షం వ్యక్తం

Azharuddin: అజార్‌కు మంత్రి పదవి.. అందుకేనా!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీజేపీ పరిస్థితి ఏంటీ!

Fee reimbursement Scheme: ఫీజు రియంబర్స్‌మెంట్ వివాదం.. నవంబర్ 3 నుంచి ప్రైవేటు కళాశాలల బంద్?

Chamala Kiran Kumar Reddy: అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర: ఎంపీ చామల

Heavy Rains: తెలంగాణపై మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షం, రైతన్నలు జర జాగ్రత్త..!

Azharuddin Oath: రేపే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు, ఎందుకంటే?

Big Stories

×