 
					Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. హోరా హోరి పోరు.. ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీ బిజీ.. ఎలాగైనా గెలిసి తీరాలని పార్టీల కీలక నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గల్లి గల్లీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలు కాలనీల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు యూసుఫ్ గూడ డివిజన్ లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతా ముదిరాజ్ లు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.
⦿ ఓటర్లు మా వైపే ఉన్నారు: మంత్రి ఉత్తమ్
ప్రచారంలో భాగంగా యూసుఫ్ గూడలో కూరగాయల షాపు ఓనర్ తో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కాసేపు ముచ్చటించారు. గత రెండేళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించారు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం స్కీం గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు అందరూ తమవైపే ఉన్నారని మంత్రి చెప్పుకొచ్చారు.
#WATCH | Hyderabad, Telangana: Minister Uttam Kumar Reddy and Ponnam Prabhakar participate in a door-to-door campaign for the Jubilee Hills by-election.
Minister Uttam Kumar Reddy says, "… Congress party is going to win the election by a huge majority. Not only in Jubilee… pic.twitter.com/mYmlJnWPKT
— ANI (@ANI) October 30, 2025
⦿ హోటల్ లో దోశ వేసిన మంత్రులు
కూరగాయల షాపుకు వెళ్లిన అనంతరం మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ యూసఫ్ గూడ డివిజన్ లోని ఓ హోటల్ కు వెళ్లారు. అక్కడ మంత్రులు దోశ వేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
⦿ జూబ్లీలో వార్ వన్ సైడే..
ఒక జూబ్లీహిల్స్ నియోజక వర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పాలనపై సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అందరికీ రేషన్ కార్డు అందజేసిన ప్రభుత్వం తమదే అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి సన్న బియ్యం స్కీ అమలు అవుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని.. ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఆనందంగా ఉన్నారని చెప్పారు. అన్ని కులాలను, మతాలను సమానంగా చూసే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సే అని మంత్రి ఉత్తమ్ చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దే అని ధీమా వ్యక్తం చేశారు.
Myself, Minister @Ponnam_INC, @azharflicks, AICC Secretary Sampath, Mahila Congress President @SunithaRao_M, & local leaders did extensive door to door campaign in Yousufguda division in Jubilee Hills constituency for the by election.
The response from the general public was… pic.twitter.com/YovM6KAclo
— Uttam Kumar Reddy (@UttamINC) October 30, 2025