BigTV English

CM Revanth Reddy: నిరుద్యోగులు ఆందోళన పడొద్దు.. సమస్యను పరిష్కరిస్తాం.. సీఎం రేవంత్ హామీ

CM Revanth Reddy: నిరుద్యోగులు ఆందోళన పడొద్దు.. సమస్యను పరిష్కరిస్తాం.. సీఎం రేవంత్ హామీ
cm revanth reddy latest news

CM Revanth Reddy handed over the appointment papers(Political news in telangana): యువత ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాలు సాధించిన 13,444 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. సీఎం మాట్లాడారు.


తెలంగాణ కోసం పోరాడిన యువత ఈరోజు ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎంగా ప్రమాణం చేసినప్పుడు వచ్చిన ఆనందం.. మీకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు వస్తోందన్నారు. రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి గట్టెక్కిస్తామని సీఎం అన్నారు. స్వరాష్ట్రం వచ్చాక బాధలు తీరుతాయని నిరుద్యోగులు ఆశించారన్నారు.

ఉద్యోగాలు భర్తీ చేయాలని గత ప్రభుత్వానికి తొమ్మిదన్నరేళ్ల పాటు ఆలోచన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారులతో సమీక్షించి ఉద్యోగాల భర్తీకి అన్ని ఆటంకాలు తొలగించామన్నారు. నిరుద్యోగులు.. అధైర్యపడకండి.. మీ సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.


Read More:  మేడిగడ్డపై సీఎం ఛాలెంజ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

తెలంగాణలో 15441పోలీసు ఉద్యోగాల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి తమ ప్రభుత్వం నియామకపత్రాలను అందజేస్తుందన్నారు. ఈ రోజు 13500 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. రేపు మరో 2వేల మందికి నియామకపత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు.

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×