Holiday: రేపు అన్ని ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎందుకంటే గురుపూర్ణిమ, గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో రాష్ట్రంలో పబ్లిక్ హాలుడే ప్రకటించారు. దీని వల్ల అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వర్తిస్తుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు సాధారణ సెలవు లేదు.. కేవలం ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది అని తెలిపారు.
గురు నానక్ జయంతి, గురుపూర్ణిమ అనేది సిక్కు మత ప్రతిపాదకుడైన గురు నానక్ దేవ్ జీ జన్మదినాన్ని జరుపుకునే పవిత్ర పండుగ. ఇది ప్రతి సంవత్సరం కార్తీక్ మాసంలో పౌర్ణమి రోజున జరుగుతుంది. నవంబర్ 5 బుధవారంన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపటికి గురు నానక్ దేవ్ జీ 556వ జయంతి. గురు నానక్ దేవ్ జీ 1469లో పాకిస్తాన్‌లోని నానకానా సాహిబ్‌లో జన్మించారు. ఆయన బోధనలు – ఏకైక దేవుడు, సమానత్వం, కరుణ, సత్యం, వండ్ చక్నా , కీరత్ కర్నీ, నామ్ జప్నా – ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రేరేపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం 2025 రాష్ట్ర సెలవు క్యాలెండర్ ప్రకారం, గురు నానక్ జయంతి & కార్తీక పౌర్ణమిని పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఇది అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, విద్యా సంస్థలు, బ్యాంకులకు వర్తిస్తుంది.
Also Read: ఒకేసారి వరుసగా 3 ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ప్రమాదాలు.. స్పాట్‌లో 65 మంది
ఆంధ్రప్రదేశ్‌లో గురు నానక్ జయంతికి సాధారణ పబ్లిక్ హాలిడే లేదు. ఇది కేవలం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. రేపు ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలలు సాధారణంగా పని చేస్తాయి. అయితే, ప్రైవేట్ స్కూళ్లు, మైనారిటీ ఇన్‌స్టిట్యూట్లుతమ అభీష్టానుసారం సెలవు పాటించవచ్చు. బ్యాంకులు కూడా ఆప్షనల్‌గా మూసివేస్తాయి, కానీ చాలా చోట్ల ఓపెన్‌గా ఉంటాయి అని తెలిపారు.