Telangana News: నాగర్‌కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లి వద్ద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్-SLBC సొరంగం తవ్వకం పనులను పునరుద్ధరించారు. ఇందులోభాగంగా హెలి బోర్న్ మ్యాగ్నటిక్ జియో ఫిజికల్ సర్వేను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఆ ప్రాంతానికి వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తొలుత సర్వే చేసిన హెలికాప్టర్ వద్దకు వెళ్లారు.
హెలి బోర్న్ మ్యాగ్నటిక్ జియో ఫిజికల్ సర్వే
ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్ ప్రకాశ్‌కుమార్-సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సత్యనారాయణలు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా టన్నెల్ ప్రాంతంలో చేపట్టే సర్వే వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత సర్వే హెలికాప్టర్‌కు సమాంతరంగా మరో హెలికాప్టర్‌లో ప్రయాణించారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు పరిశీలించారు.
హెలి బోర్న్ మ్యాగ్నటిక్ జియో ఫిజికల్ సర్వే అంటే ఏమిటి? భూమి ఉపరితలం కింద ఉన్న నీటి వనరులు, భౌగోళిక నిర్మాణాలను గుర్తించడానికి ఉపయోగించే లేటెస్ట్ సాంకేతిక పద్ధతి ఇది. ఈ సర్వేలో భాగంగా హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ మీటర్ ను అమర్చుతారు. హెలికాప్టర్ కేవలం 50-150 మీటర్లు తక్కువ ఎత్తులో నిర్ణయించిన మార్గాల్లో ఎగురుతుంది.
హెలికాఫ్టర్ నుంచి ప్రత్యక్షంగా, సీఎం రేవంత్-మంత్రులు
మ్యాగ్నెటోమీటర్ పరికరం భూమిలోపల కలిగే సూక్ష్మమైన మార్పులను గమనిస్తుంది. వాటిని హెలికాప్టర్‌లోని సెన్సార్లు రికార్డు చేస్తాయి. ఈ ప్రాసెస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రత్యక్ష్యంగా తిలకించారు. దీనికి సంబంధించిన ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ వీడియో చూద్దాం.
భూమిపై చేపట్టే నార్మల్ సర్వేలతో పోలిస్తే హెలి బోర్న్ మ్యాగ్నటిక్ జియో ఫిజికల్ సర్వే చాలా వేగంగా జరుగుతుంది. అంతేకాదు గ్రౌండ్ సర్వే కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా. భూమికి దగ్గరగా ఎగరడం వల్ల ఉపయోగించే టెక్నాలజీ వల్ల అధిక రిజల్యూషన్ డేటాను అందించవచ్చు.
ALSO READ: బుధవారం విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు
ముఖ్యంగా పర్వతాలు, అరణ్యాలు, ఎడారులు వంటి ప్రదేశాల్లో సర్వే ఈజీగా చేయవచ్చు. దేశంలో, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థలు ఈ తరహా సాంకేతికతను ఉపయోగిస్తాయి. దీనివల్ల వివిధ రాష్ట్రాలలో భూగర్భ జలాల మ్యాపింగ్ ప్రాజెక్టులు చేపడతాయి కూడా.
ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయానికి వద్దాం. 40 కిలోమీటర్ల టన్నెల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది పూర్తయితే తెలంగాణకు రికార్డు క్రియేట్ చేయనుంది. అప్పట్లో అది టైగర్ రిజర్వు ఫారెస్ట్ కావడంతో టన్నెల్ తవ్వకం కోసం బోర్ మిషన్‌ను వినియోగించారు. ఇటీవల టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ఆ తర్వాత కొంత విరామం వచ్చింది. దాదాపు 10 కిలోమీటర్ల పనులు పెండింగ్ లో ఉన్నాయి. పనులు పునరుద్దరణలో భాగంగా హెలి బోర్న్ మ్యాగ్నటిక్ జియో ఫిజికల్ సర్వే చేపట్టింది ప్రభుత్వం.
SLBC ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ప్రత్యక్షంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
సర్వే హెలికాప్టర్ కు సమాంతరంగా మరో హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తూ కిటికీ నుంచి SLBC సొరంగం తవ్వకానికి సంబంధించిన సర్వేను వీక్షించిన సీఎం,… pic.twitter.com/bDfQgLPt4b
— BIG TV Breaking News (@bigtvtelugu) November 4, 2025