BigTV English

RGV Vyooham – Sapatham Movies: వ్యూహం, శపథం మూవీల రిలీజ్ డేట్లు ప్రకటించిన ఆర్జీవి

RGV Vyooham – Sapatham Movies: వ్యూహం, శపథం మూవీల రిలీజ్ డేట్లు ప్రకటించిన ఆర్జీవి
Latest movies in tollywood

RGV Vyooham – Sapatham Movies Release Dates(Latest movies in Tollywood): వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వ్యూహం’. సినిమా ప్రకటించినప్పటి నుంచి అందరిలోనూ అంచనాలు తీవ్ర స్థాయిలో ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నాడు దర్శకుడు ఆర్జీవి. ఇందులో భాగంగానే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్ ప్రేక్షకాభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.


ఈ పోస్టర్లతోనే సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా మాసివ్ స్పందన వచ్చింది. ఇక సెన్సార్ పూర్తి చేసుకుని జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అప్పటికే రిలీజైన ట్రైలర్‌‌తో ఈ సినిమాపై దుమారం రేగింది. ముఖ్యంగా ట్రైలర్‌లో.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన కొందరు ముఖ్య నాయకులను కించపరిచినట్లు పేర్కొంటూ ఆ పార్టీకి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మూవీ విడుదలను ఆపాలంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీంతో ఈ సినిమా సెన్సార్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దుచేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ మూవీ యూనిట్.. డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన బెంచ్.. ఈ మూవీని మరోసారి సమీక్షించాలని సెన్సార్ బోర్డుకు ఆదేశించింది. దీంతో ఈ మూవీని మరోసారి సమీక్షించిన సెన్సార్ బోర్డు.. యూ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. దీంతో వ్యూహం సినిమా ఈ వివాదం నుంచి బయటపడి రిలీజ్‌కు సిద్ధమైంది.


READ MORE: RGV’s Vyooham Movie: ఆర్జీవి ‘వ్యూహం’ సినిమాకు గ్రీన్ సిగ్నల్.. రిలీజ్‌కు రెడీ..!

కాగా ఈ మూవీని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగాన్ని ‘వ్యూహం’ గానూ, రెండవ భాగాన్ని ‘శపథం’గానూ తెరకెక్కించబోతున్నట్లు తెలిపాడు. దీంతో ఈ మూవీకి కోర్టులో గ్రీన్ సిగ్నల్ పడటంతో ఈ మూవీ రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 16న రిలీజ్ చేసే అవకాశమున్నట్లు టాక్ వినిపించింది. అందరూ ఈ తేదీనే రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ ఆ తేదీ కాదు. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై దర్శకుడు ఆర్జీవీ తాజాగా తన ఇన్‌స్టాలో చెప్పుకొచ్చాడు. ‘వ్యూహం’ పేరుతో రిలీజ్ కాబోతున్న సినిమాను ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించాడు.

ఇక ఈ సినిమాతో పాటుగా సెకండ్ పార్ట్ ‘శపథం’ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించాడు. ఈ సెకండ్ పార్టును మార్చి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపాడు. దీంతో ఈ మూవీ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

READ MORE: Vyuham Movie : “వ్యూహం” విడుదలపై ఉత్కంఠ.. లైన్ క్లియర్ అవుతుందా ?

కాగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు ఈ వ్యూహం మూవీ ఉండనుంది. ఈ వ్యూహం మూవీలో వైఎస్ జగన్ పాత్రలో నటుడు అజ్మల్ నటించగా.. వైఎస్ భారతి పాత్రలో మానస నటించారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×