CM Revanth Reddy : తెలంగాణకు పెట్టుబడులపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. విదేశీ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మూసీ ప్రక్షాళనే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్..ఈ దశలోనే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గౌతమ్ అదాని, టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. 15 వేల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

దావోస్ పర్యటన ముగిసిన అనంతరం లండన్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి.. థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులను కలుసుకున్నారు. వారితో సమావేశం అయ్యారు. అనంతరం థేమ్స్ నదీ తీరంలో కలియతిరిగారు. లండన్ బ్రిడ్జి, లండన్ ఐ, బిగ్ బెన్, టవర్ బ్రిడ్జ్‌ను తిలకించారు. వాటిని నిర్మించడం వల్ల ప్రభుత్వనికి అందుతోన్న ఆదాయం, నిర్వహణ వ్యయం గురించి.. థేమ్స్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి.
పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడంపై అందుతోన్న రోజువారీ రెవెన్యూ వివరాలను రేవంత్ రెడ్డి వివరించారు అక్కడి అధికారులు. హైదరాబాద్‌లో లండన్ ఐ ఏర్పాటు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రతిపాదనలను వారితో చర్చించారు. లండన్ ఐ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలంటూ సూచించారు. దీనివల్ల హైదరాబాద్ ఆదాయం మరింత పెరుగుతుందని అంచనావేశారు సీఎం రేవంత్.
మరోవైపు ఈ నెల 15 నుంచి 19 వరకు కొనసాగిన రేవంత్ దావోస్ పర్యటన విజయవంతమైంది. ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణకు పెట్టుబడులను సాధించడంలో సక్సెస్ అయింది రేవంత్ టీమ్. రాష్ట్రానికి 40 వేల 232 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటించింది ముఖ్యమంత్రి కార్యాలయం.