E-Paper
Advertisement

యాదాద్రి జిల్లాలో 108 సిబ్బంది రికార్డు.. ఏం చేశారంటే..?

యాదాద్రి జిల్లాలో 108 సిబ్బంది రికార్డు.. ఏం చేశారంటే..?
Advertisement

EMT Services: స్వేచ్ఛ బ్యూరో: అత్యవసర వైద్య సేవలో అంకితభావంతో సేవలందిస్తున్న 108 అంబులెన్స్ లోని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల సేవలను గుర్తించేందుకు జీవీకే ఈఎంఆర్ఐ 108 సంస్థ ఏప్రిల్ 2న ఈఎంటి దినోత్సవం జరుపుకుంటారు.రోడ్డు ప్రమాదాలలో గుండెనొప్పి , శ్వాస సంబంధ వ్యాధులు,ఆత్మహత్యాత్నం, పాముకాటు ,పేలుడు ప్రమాదాలు ,కరెంటు షాక్ రైలు ప్రమాదాలు కొట్లాటలు కడుపునొప్పి , విరేచనాలు, వడదెబ్బ, మరియు నవజాత శిశువులకు సేవలు అందించడంలో ముందు వరుసలో ఉంటున్నాయి చిన్న ,పెద్ద పేద ,ధనిక అనే తేడా లేకుండా ప్రతిరోజు ఎక్కడో అక్కడ 108 సేవలు ప్రజలకు అందడంలో ఎంతో కీలకపాత్ర వహిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈఎంటి జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక కథనం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో..

108 అంబులెన్స్ సేవలు ప్రారంభం అయినప్పటి నుంచి లక్షలాది ప్రాణాలు కాపాడడంలో ఈఎంటిలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంబులెన్స్ లోనే మార్గమధ్యంలో ప్రయాణించేటప్పుడు ఎంతో మంది గర్భిణీ స్త్రీలకు ప్రసవం చేయడం వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడి ఒక పునర్జన్మను ఇవ్వడం లాంటిది అటువంటి 108 సేవలు 2005 వ సంవత్సరం నుండి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టబడిన మానస పుత్రికగా చెప్పబడుతున్న 108 సేవలు అభినందించబడినవి. అప్పటినుండి ప్రజలకు పగలు రాత్రి అనకుండా సంవత్సరం ఏడాది పాటు ఎప్పుడూ మేమున్నామంటూ కీలక సేవలను అందిస్తున్నాయి. 2020 కరోనా సమయంలో కుటుంబ పెద్ద దిక్కు కూడా దగ్గరకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న క్రమంలో కూడా 108 సిబ్బంది వాళ్ల యొక్క విధి నిర్వహణలో భాగంగా మేమున్నాము అంటూ ఆత్మవిశ్వాసం కల్పించి అందించిన సేవలు విశ్వసనీయం.

గత సంవత్సరం

Advertisement

యాదాద్రి జిల్లాలో 12 అంబులెన్సులు ఒక నియోనేటల్ అంబులెన్స్ ఉన్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు ఈ అంబులెన్సులు ట్రామా కేసులు 2532, గర్భిణి కేసులు1456, అన్ కాన్షియస్ కేసులు 863, కడుపునొప్పి కేసులు 1667, బ్రీతింగ్ ప్రాబ్లం కేసులు 1132, ట్రామా నాన్ వెకిలర్ కేసులు1204, పాయిజన్ కేసులు 641, కార్డియా కేసులు 1072, ఫిట్స్ కేసులు 554, సూసైడ్ అటెంప్ట్ కేసులు353, స్ట్రోక్ కేసులు 281, ఎనిమల్ ఎటాక్ కేసులు 404, బర్న్స్ కేసులు 54 , సాధారణ మెడికల్ కేసులు 2709 మొత్తం కేసులు 14922 చేయడం జరిగింది.

Also Read: తెలంగాణ మీసేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు.. ఏ సర్టిఫికెట్‌కు ఎంత కాస్ట్ అంటే..?

పోగ్రామ్ మేనేజర్ సలీం..

Advertisement

ఈఎంటి సేవలు వేల కట్టలేనివి ఉత్తమ సేవ 108 అత్యవసర సేవలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అందించే ప్రధమ చికిత్స ఒక కుటుంబ పెద్దదిక్కు యొక్క ప్రాణ రక్షణకు కీలకపాత్ర పోషిస్తారు.

ప్రాణాలను లెక్క చేయము..

108లో అత్యవసర సేవలు అందించి ఈఎంటిలో చేసే పని చాలా రిస్క్ తో కూడుకున్నది ఎప్పుడు ఏ సమయమైనా ప్రజలకు సేవలు అందించడమే మా విధి. ఎండాకాలంలో వడదెబ్బ కారణంగా వచ్చే ఎమర్జెన్సీ లను ప్రథమ చికిత్స అందించడానికి ఓఆర్ఎస్ లో అందుబాటులో ఉంటున్నాయి. ఈఎంటి లది సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తుదని ఈఏంఈ మహేశ్ కుమార్ అన్నారు.

కాపాడడమే మా లక్ష్యం

అత్యవసర 108 సేవలో గత 16 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను. ప్రమాదంలో ఉన్న వారిని కాపాడడంలో ఉన్న ఆనందం మించింది ఇంకా ఎక్కడ దొరకదు ఉత్తమమైన ప్రథమ చికిత్స అందిస్తూ పోవడమే మా లక్ష్యం అని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సేవర్తి విశ్వం తెలిపారు.

కరోనాకాలంలో..

నేను గత ఐదు సంవత్సరాలుగా కరోనాకాలంలో ప్రజలకు సేవలు అందించడం పై ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపిక కరోనా లాంటి ఇంకా ఎన్ని పరిస్థితులు వచ్చినా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బత్తిని రవికుమార్ తెలిపారు.

Also Read: మున్సిపల్ కొలువులకు గ్రీన్ సిగ్నల్.. దరఖాస్తులు స్వీకరణ

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×