BigTV English

CM Revanth Reddy: కొడంగల్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రూ.4,369 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు

CM Revanth Reddy: కొడంగల్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రూ.4,369 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు

CM Revanth Reddy Kodangal Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా స్వంత నియోజకవర్గం అయిన కొడంగల్ కు చేరుకున్నారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత కొడంగల్ కు వెళ్లడం ఇదే మొదటి సారి. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లలో కొడంగల్ కు చేరుకుంటారు.


కోస్గిలో రూ.4,360 కోట్లతో 20 అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న నారాయణపేట- కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ పతకానికి శంకుస్థాపన చేశారు. దీనికి రూ. 2,945 కోట్లు ఖర్చు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రూ. రూ.6.8 కోట్ల వ్యయంతో కొడంగల్ లో ఆర్ అండ్ బి అతిధి గృహంకు శంకుస్థాపన చేశారు.

అనంతరం రూ.344.5 కోట్ల అంచనా వ్యయంతో కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సింగిల్ లైన్ నుండి డబుల్ లైన్ రోడ్ల విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.27.886 కోట్లతో వికారాబాద్ జిల్లాలో బిటి రోడ్డు సదుపాయం లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసేందుకు శంకుస్థాపన చేశారు.


దౌల్తాబాద్ మండలం మహాత్మా జ్యోతిరావు పూలే బిసీ రెసిడెన్షియల్ స్కూల్/ కాలేజికి నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.360 కోట్లతో చంద్రకల్ గ్రామం,దౌల్తాబాద్ మండలంలో నూతన వెటర్నరీ కాలేజి నిర్మాణం, రూ.30 కోట్లతో కోస్గి మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు.

రూ.11 కోట్లతో కోస్గి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.20 కోట్లతో మద్దూర్ మండల కేంద్రంలో బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్,జూనియర్ కాలేజిని నిర్మించేందుకు పనులను ప్రారంభించారు.రూ.25 కోట్లతో కొడంగల్ మండల కేంద్రంలో బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. వారితో ముఖాముఖిలో పాల్గొని మాట్లాడారు. స్వయం సహాయక బృందాలను బలోపేతం చేస్తామన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఐకేపీ, మహిళా సంఘాల ద్వరా పంటల కొనుగోళ్లు చేపడుతామన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ్మ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతికుమారిలు ఉన్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×