Big Stories

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసు.. క్యాన్సర్ బాధితుడి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం..

CM Revanth Reddy latest news

- Advertisement -

CM Revanth Reddy latest news(Telangana news): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. హైదరాబాద్‌లోని బవసతారకం ఆస్పత్రిలో క్యాన్సర్ తో బాధపడుతున్న నవీన్ అనే యువకుడికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని సీఎం తెలిపారు. క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న నవీవ్ విషయం తెలిసిన వెంటనే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

- Advertisement -

రెండు రోజుల క్రితం నవీన్ అనే 18 ఏళ్ల యువకుడు బ్లడ్ క్యాన్సర్‌తో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేరాడు. అయితే చికిత్స కోసం పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అంతేకాదు.. బాధితుడికి బీమా కవరేజీ లేదని తెలియడంతో.. పలువురు ట్విట్టర్ లో సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ నవీన్ పరిస్థితిని వివరించారు. దీంతో.. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Read More: పట్టాలెక్కిన ప్రగతి పాలన.. 90 రోజుల్లోనే 3 హామీల అమలు

సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం పట్ల పలువురు బాధితుడు, బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇక నెట్టింట్లో ఒక సామాన్యుడు సీఎం అయితే ప్రజల బాధలను అర్థం చేసుకుని వారి వెన్నంటే ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన మంచి పనిని మెచ్చుకుంటున్నారు. గతంలో సీఎం హోదాలో కేసీఆర్ ను పరామర్శించడానికి సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఒక మహిళ రేవంతన్నా అని పిలవడంతో ఆమె దగ్గరకు వెళ్లి.. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

గత పాలకులు కనీసం ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదని ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రజా పాలన మొదలయ్యిందని ప్రజలు అనుకుంటున్నారు. రాబోయే కాలంలో కుడా ఇలాగే ఉండి సామాన్యులకు అండగా నిలవాలని ట్విట్టర్ వేదికగా పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News