BigTV English

Ananth Pre Wedding: భారతీయ సంప్రదాయాలకు అద్దం పట్టేలా అనంత్ ప్రీ వెడ్డింగ్

Ananth Pre Wedding: భారతీయ సంప్రదాయాలకు అద్దం పట్టేలా అనంత్ ప్రీ వెడ్డింగ్

Anant ambani Radhika merchant pre wedding update


Anant ambani Radhika merchant pre wedding update: అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకలకు దేశంలోని ప్రముఖులే కాకుండా..విదేశాల నుండి కూడా పలువురు ముఖ్య పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

గతవారం రోజుల నుండి దేశంలో ఎక్కడ చూసిన సరే అంబానీ వేడుకలకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. అంతేకాదు ట్రెండింగ్‌లోనూ దూసుకుపోతున్నాయి. అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది సెలబ్రెటీల డెస్టినేషన్ జామ్‌నగర్‌ అయిపోయింది. ఇందులో మరో విశేషమేమిటంటే.. విదేశీ సంప్రదాయాలకు తావివ్వకుండా కేవలం భారతీయ సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. దీంతో భారతీయులందరూ షాక్ అవుతున్నారు. అంతేకాకుండా వారి ప్రశంసలను సైతం అందుకుంటున్నారు.


ఈ వేడుకలు స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మెహందీ ఫంక్షన్ నుంచి ప్రధాన వేడుక వరకు కూడా అన్నింటిని సంప్రదాయ పద్దతిలో నిర్వహించడం నిజంగా గ్రేట్‌ అనే చెప్పాలి. ఈ వేడుకలకు భారీగా విదేశీయులు కొలువుదీరి ఉన్న వేదికపై అచ్చమైన భారతీయ సంప్రదాయపద్దతిలో వివాహం జరగడం అభినందనీయమని నెటిజన్లు కొనియాడుతున్నారు.

ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడురోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈవెంట్ చివరిరోజున స్టార్స్ నుంచి అంబానీ ఫ్యామిలీ వరకు భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. నీతా అంబానీ చేసిన డ్యాన్స్ మాత్రం వచ్చిన అతిథులను మెస్మరైజ్ చేసింది. సంప్రదాయం, ఆధ్యాత్మికతకు మేళవిస్తూ సాగిన ఈ నృత్యం చూపరులను ఆద్యంతం ఆకట్టుకుందనే చెప్పాలి.

Read More:  ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌కు క్యాన్సర్‌.. ఆదిత్య ఎల్-1 ప్రయోగం రోజే నిర్ధారణ..

శక్తి, సహనానికి ప్రతిరూపమైన దుర్గాదేవిని స్తుతిస్తూ సాగిన ఈ పాటకు నీతా అంబానీ మంత్రముగ్ధులయ్యే ప్రదర్శన ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అనంత్-రాధిక కోసం తల్లి ఆశీస్సులను కోరుతూ నీతా అంబానీ ఈ ప్రదర్శన చేశారు. తమ కుమారుడు అనంత్, కోడలు రాధికా మర్చంట్ భవిష్యత్ మంచిగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులను కోరుతూ ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది.

 

 

Tags

Related News

Aadhar – Pan Cards: ఆధార్, పాన్, ఓటర్ ఐడీ.. దానికి పనికి రావు

Minta Devi Bihar: పార్లమెంట్ లో రచ్చరేగిన..124 ఏళ్ల ఓటరు ఎక్కడ?.. ఆమె మాట ఇదే!

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Big Stories

×