CM Revanth Reddy : పార్లమెంట్ స్థానాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాధి రాష్ట్రాలకు అన్యాయం జరుగే అవకాశాలున్నాయనే ఆందోళనల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటుగా ప్రజల్లోనూ చైతన్యం కలిగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. డీలిమిటేషన్ విషయమై తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో సమావేశమైన దక్షిణాధి రాష్ట్రాల సీఎంల సమావేశం తర్వాత.. ఇకపై ఈ మహత్తర కార్యక్రమానికి హైదరాబాద్ ఆకారం అందించనుంది అని ప్రకటించారు.
జాతీయ పార్టీగా ఉత్తర, దక్షిణాధి రాష్ట్రాలను, ప్రాంతాలను గౌరవిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే పార్లమెంట్ స్థానాల్ని పునర్విభజించాలని చూస్తోందని మండిపడ్డారు. సమైక్య స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకునే తమకు.. కేంద్రం వైఖరి ఇబ్బందికరంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే.. నిధుల కేటాయింపులో, వాటాల పంపకంలో ఎన్నో వివక్షలు చూపిస్తున్న కేంద్రం.. రానున్న రోజుల్లో పార్లమెంట్ స్థానాల్ని తగ్గించి మరింత హింసించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
పుణ్యభూమి భారత్.. తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణాధి వరకు.. అంబేద్కర్ మహనీయుడు రచించిన రాజ్యాంగ స్ఫూర్తి కారణంగా సమైక్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. అలాంటి గొప్పవాళ్ల ఆలోచనల కారణంగానే దేశంలోని అన్ని ప్రాంతాలు సామాజిక న్యాయాన్ని, సమాన హక్కుల్ని పొందాయని వ్యాఖ్యానించారు. కానీ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్య కాంక్షతోనే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ద్వారాను రాజకీయ ప్రయోజనాల్ని ఆశిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పుణ్యభూమి …
తూర్పు నుండి పడమర వరకు…
ఈ ధన్యభూమి …
ఉత్తరం నుండి దక్షిణం వరకు…
అంబేద్కర్ మహనీయుడు రాసిన
రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని…
సామాజిక న్యాయాన్ని,
సమాన హక్కులను పొందింది.ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను…
కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో…
రాజకీయ ప్రయోజన…— Revanth Reddy (@revanth_anumula) March 22, 2025
పోరాటానికి సిద్ధం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీ లిమిటేషన్ ను అస్త్రంగా ప్రయోగించి.. ఇక్కడి సమాఖ్య స్పూర్తిని, సమాన హక్కుల్ని విచ్ఛినం చేస్తామంటూ చూస్తూ మౌనంగా కూర్చోమంటూ ప్రకటించారు. ఉత్తరాధిని గౌరవిస్తామంటూ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అది డీ లిమిటేషన్ ఐనా, విద్యా వ్యవస్థపై పెత్తనమైనా.. కేంద్రం ఏకపక్ష, రాజకీయ ప్రయోజనాలతో కూడిన విధానాల్ని అంగీకరించేది లేదు స్పష్టం చేశారు.
డీ లిమిటేషన్ పై పోరాటంలో ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టిందని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇక హైదరాబాద్ ఈ ఉద్యమానికి ఆకారం ఇస్తుంది ప్రకటించారు. న్యాయం జరిగే వరకు.. ధర్మం గెలిచే వరకు తమ పోరాటం ఆగిపోదని ప్రకటించి, అందర్ని ఆశ్చర్యపరిచారు.
Also Read : Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు.. 17 మంది ఇంజనీర్లపై ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు
సీఎం రేవంత్ రెడ్డి తాజా ట్వీట్ తర్వాత డీలిమిటేషన్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందని స్పష్టంగా వెల్లడించినట్లైందంటున్నారు రాజకీయ నిపుణులు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నుంచి కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి సమాయత్తమవుతున్నారని స్పష్టం అవుతుందని చెబుతున్నారు. దక్షిణాధి రాష్ట్రాల సీఎంలను ఒక్కతాటి పైకి తీసుకువచ్చి.. కేంద్రం వైఖరిపై పోరాటం సాగించే ఆలోచనలు చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.
Also Read : CM Revanth – Harish Rao: సీఎంతో భేటీ రచ్చ రచ్చ.. అసలు ప్లాన్ ఇదేనా?