Live Suicide In Madhya Pradesh: మనుషులలో రోజు రోజుకు మానవత్వం చచ్చిపోతోంది. కళ్ల ముందే మనిషి చనిపోతున్నా ఆపే ప్రయత్నం చేయడం లేదు. ఇలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగింది. వేధింపులు తాళలేక ఓ యువకుడు సోషల్ మీడియాలో లైవ్ పెట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ లైవ్ చూసి వద్దని వారించాల్సిన భార్య, అత్త దమ్ముంటే సూసైడ్ చేసుకోవాలని రెచ్చగొట్టారు. ఈ నేపథ్యంలో సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంచలన కేసుకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి భార్య, అత్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
భార్య వేధింపులు తాళలేకే ఆత్మహత్య
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లా మెహ్రాకు చెందిన 27 ఏండ్ల యువకుడికి 24 ఏండ్ల యువతితో కొద్ది సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. ప్రస్తుతం వారికి 6 నెలల బిడ్డ కూడా ఉంది. ఇద్దరూ తరచుగా గొడవలు పడేవారు. ఈ నేపథ్యంలో సదరు మహిళ భర్తకు దూరంగా ఉంటుంది. తన తల్లితో కలిసి జీవిస్తుంది. మృతుడు గుజరాత్‌లోని వార్ధాలో పూజారిగా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో అతని కాలికి గాయం కావడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. చనిపోవడానికి ముందు ఆ వ్యక్తి తన భార్యను తిరిగి తీసుకురావడానికి తన అత్తగారి ఇంటికి వెళ్లాడు. రమ్మని రిక్వెస్ట్ చేశాడు. తను మాత్రం అతడితో రానని తెగేసి చెప్పింది. తీవ్ర మానసిక క్షోభకు గురైన యువకుడు, ఇంటికి వచ్చి సోషల్ మీడియాలో లైవ్ పెట్టి ఆత్మహత్యకు ప్రత్నించాడు.
ఆత్మహత్య చేసుకునేలా రెచ్చగొట్టిన భార్య, అత్త
సోషల్ మీడియాలో భర్త లైవ్ చూసి వద్దని చెప్పాల్సింది పోయి, ఆత్మహత్య చేసుకునేలా తన తల్లితో కలిసి రెచ్చగొట్టింది. మరింత బాధకు లోనైన సదరు యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్చి 16న ఈ ఘటన జరిగింది. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు, విచారణ ప్రారంభించారు. లైవ్ ప్రసారం చేసిన వీడియోను పరిశీలించారు. తన భార్య, అత్త కలిసి జీవితాన్ని సర్వనాశనం చేశారని, తన ఇంటిని ఆగం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని బేస్ చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. యువకుడి ఆత్మహత్యకు భార్య, అత్త కారణం అని భావిస్తూ వారిని అరెస్ట్ చేశారు. అయితే, తాను అతడు చనిపోయి తర్వాతే సోషల్ మీడియాలో లైవ్ పెట్టాడనే విషయాన్ని తెలుసుకున్నట్లు చెప్పింది. ఆమె చెప్పిన దాంట్లో ఎలాంటి నిజం లేదని పోలీసులు తెలిపారు. అతడి ఆత్మహత్యను లైవ్ లో చూస్తూ ప్రేరేపించినట్లు తమకు ఆధారాలు లభించాయన్నారు.
రీసెంట్ గా ఆగ్రాలోనూ ఇలాంటి ఘటనే
గత నెలలో ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. భార్య వేధింపులు తట్టుకోలేక, 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య పెట్టిన హింసలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి భార్యను అరెస్టు చేశారు.
Read Also: తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేసిన నీచుడు, మరీ ఇంత ఘోరంగా తయారవుతున్నారేంటి భయ్యా?