CM Revanth – Harish Rao: సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్‌రావు, పద్మారావు, మల్లారెడ్డి భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వారి భేటీలపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చల మొదలయ్యాయి. అటు అసెంబ్లీలో ఇటు బయటా సీఎం రేవంత్‌రెడ్డి, హరీష్‌రావుల మధ్య మాట యుద్దం నడుస్తున్న తరుణంలో వారిద్దరు భేటీ అవ్వడంతో బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారంట.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా వెళ్లి కలవడంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద డిబేటే నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోందంట. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్‌ల మధ్య అసెంబ్లీలో, బయటా మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ఆ ఇరువురి భేటీపై రెండు పార్టీల నేతలతోపాటు బీజేపీ నేతలు కూడా చెవులు కోరుక్కుంటున్నారంట
ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కేసీఆర్, కేటీఆర్‌లు పలు సందర్భాల్లో తప్పుపడుతూ ధ్వజమెత్తుతున్నారు. కౌన్సిల్ వేదికగా ఎమ్మెల్సీ కవిత కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్‌తో హరీశ్‌రావు భేటీ కావడంపై ఇతర పార్టీల కంటే బీఆర్ఎస్‌లోనే లోతుగా చర్చజరుగుతుందట. రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం చేసే సమయంలో జరిగిన ఈ సమావేశం గులాబీ శ్రేణులకు, లీడర్లకు మింగుడుపడటంలేదట.
ఉద్దేశమేదైనా రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లవుందనే అభిప్రాయం వ్యక్తమవుతుందట. ఇప్పటికే కులగణన విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు దూరంగా ఉన్నా.. కవిత మాత్రం పాల్గొనడంతో ఆ పార్టీ డిఫెన్సులో పడింది.. దానికి కొనసాగింపుగా ఇప్పుడు హరీశ్‌రావు వ్యవహారం ఆ పార్టీకి కొత్త తలనొప్పిలా తయారైందంట.
ముఖ్యమంత్రిని ఎందుకు కలిశాననే అంశంపై హరీశ్‌రావు స్వయంగా వివరణ ఇచ్చినా దానిపై చర్చలు మాత్రం ఆగడం లేదు. హరీశ్ ఒక్కడే కాదు పద్మారావు, మల్లారెడ్డి కూడా సీఎంను అదే రోజు కలవడం పెద్ద చర్చకు దారి తీసింది. సీఎంను హరీశ్‌ను కలిసిన వెంటనే బీజేపీ ప్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఇరువురి భేటీ వెనక వ్యూహం ఉందంటూ కామెంట్స్ చేశారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తిప్పికోడుతున్నాయి.
Also Read: సౌత్ ఇండియా ఛాంపియన్.. టార్చ్ బేరర్ రేవంత్
ప్రజాసమస్యలపై ఏ పార్టీ చెందిన ఎమ్మెల్యేలైన సీఎం కలవ వచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన.. ప్రజాసమస్యల పరిష్కరానికి తనను ఎవరైన కలవవచ్చని సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెబుతున్నారు.. మొత్తానికి బీఆర్ఎస్ నేతలు వరసగా సీఎం కలవడంపై జరుగుతున్న పొలిటికల్ రచ్చ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.