SRH VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals ) మధ్య రెండవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్, అలాగే ఇషాన్ కిషన్ ఇద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో.. సన్రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో… ఆరు వికెట్లు నష్టపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 286 పరుగులు చేసింది. గతంలో 287 పరుగులు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్… ఇప్పుడు… 286 దగ్గర ఆగింది. 300 కొడతారు అనుకుంటే… చివర్లో ఒత్తిడి పెరగడంతో… 286 పరుగులు చేశారు.
Also Read: SRH VS RR: బ్యాటింగ్ చేయనున్న SRH… 300 కొట్టడం పక్కా!
అయితే ఈ మ్యాచ్ లో మొదట… టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్… బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే మొదట సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తే… చాలా ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. ఆ విషయం తెలిసినప్పటికీ… మొదట బ్యాటింగ్ ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. ఈ తరుణంలోనే నిర్ణయిత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన హైదరాబాద్ 286 పరుగులు చేసింది.
అయితే మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. భారీ స్కోర్ చేయడానికి కారణం హెడ్, ఇషాన్ కిషన్. హెడ్ 67 పరుగులు చేయగా… అందులో 9 బౌండరీలు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 31 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు హెడ్. ఇక.. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లోని 106 పరుగులు చేసి రఫ్ ఆడించాడు. ఇందులో ఆరు సిక్సర్లు, 11 బౌండరీలు ఉన్నాయి. 225 స్ట్రైక్ గ్రేడ్ తో… రఫ్ ఆడించాడు ఇశాన్ కిషన్. అలాగే అభిషేక్ శర్మ కూడా 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్ అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి.
Also Read: IPL 2025: ఐపీఎల్ మ్యాచ్ లతో జాగ్రత్త… మఫ్టీ గెటప్ లో లేడీలు ?
ఇషాన్ కిషన్ సెంచరీ
ఉప్పల్ లో జరిగిన ఇవాల్టి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సెంచరీ చేసి.. అద్భుతంగా రాణించడం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చాలా ప్లస్ అయింది. ఆడిన తన మొదటి మ్యాచ్ లోనే…. సెంచరీ చేసి రాజస్థాన్ రాయల్స్ కు చుక్కలు చూపించాడు ఇషాన్ కిషన్. ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా… ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాక్టీస్… ఇవాల్టి మ్యాచ్ లో పనికి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లలో 76 పరుగులు ఇచ్చాడు. అలాగే.. తీక్షణ 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్ పాండే.. 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.