New Ration Cards: రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సందర్భంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలోని బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. కొత్త రేషన్‌కార్డు పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ రేషన్‌కార్డు అనేది మీ ఆత్మగౌరవమన్నారు. ఎక్కడికి వెళ్లినా ఆకలి తీర్చే కార్డని అన్నారు. రేషన్ అనే వ్యవస్థను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ తెలిపారు.ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకుని పేదలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని సీఏం తెలిపారు.
“మీ బతుకు చెడ.. బతుకమ్మ చీరల్లో కూడా కమిషన్ కొట్టి, ఆ పాపానికి కొట్టుకపోయి ఫామ్‌హౌస్‌లో బందీ అయి బతుకుతున్నారని సీఎం ఫైర్ అయ్యారు. మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తారా? అని సీఎం రేవంత్ అన్నారు.
ఇక నుండి ప్రతి ఆరు నెలలకు ఒక నోటిఫికేషన్ ఇస్తాను. నిరుద్యోగ యువకులకు ఒక్కటే సూచన వాళ్ళ ట్రాప్‌లో పడకండి. అగ్గిపెట్టె రావు పెట్రోల్ తెచ్చుకుండు కానీ ఆయనకు అగ్గిపెట్ట దొరకలేవు. ఇవాళ మళ్ళీ పిల్లల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నేను మీరందరికి మాట ఇస్తున్న మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని సీఎం రేవంత్ అన్నారు. దుర్మార్గులు వచ్చి మాయ మాటలు చెప్తారు మీరు వాళ్ళ మాటలు నమ్మకండి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని అన్నారు.
ప్రతి ఏడాది 75 వేల కోట్ల రూపాయిలు అప్పులు వాళ్ళు చేసిన దానికి కడుతున్నామని, అన్నం తిన్న తినకపోయినా కెసిఆర్ చేసిన అప్పులకు 75 వేల కోట్లు కడుతున్నామరని అన్నారు. సంక్షోభంలో నుండి తెలంగాణను సంక్షేమం వైపు తీసుకొస్తున్నామని, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, 12 బీజేపీ పాలనను మీరు చుడండి, మేము చేసిన రెండున్నరేళ్ల పాలన చుడండి బేరోజు వేయండని అన్నారు. మా మహేష్ పీసీసీ ఆధ్యక్షుడు అయ్యాక బీసీ గణన చేపట్టామని, 2030 వరకు మీ ఆశీర్వాదం ఉండాలి, మీ ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది లేదని సీఎం రేవంత్ అన్నారు.
ఒకాయన తమిళనాడు పోయిండు అఘోరా పూజలు చేస్తుండు, ఈ రాష్ట్రంలో రైతులు సచ్చిపోవాలి, కరువు రావాలి, ప్రభుత్వం పోవాలని కుట్రలు చేస్తున్నారు, ఈ చేతబడులు రాష్ట్రం పడుకోవాలని కోరుకుంటున్నాడని అన్నారు. మీరు కర్ణాటక, తమిళనాడు పోయినట్లు ఎందుకు సోషల్ మీడియాలో ఎందుకు ఫోటోలు పెట్టలేదు. శివ మొగ్గ గుడికి పోయింది ఎందుకు చెప్పలేదు, ఆ గుడిలో ఫొటోస్ ఎందుకు పెట్టలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. బావ కోసం బావ మరిది బయటికి వచ్చింది మా బావ మంచి పని చేసిండు అని చెప్తుండు కానీ.. మాకు దేవుని ఆశీర్వాదం ఉంది ఎల్ నీలో ప్రభావంలో కూడా ఎల్లంపల్లిలో నీళ్లు వచ్చాయని సీఎం తెలిపారు.
రేషన్‌కార్డు అనేది మీ ఆత్మగౌరవం: సీఎం రేవంత్‌రెడ్డి
రేషన్‌కార్డు అనేది కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ రేషన్‌కార్డు అనేది మీ ఆత్మగౌరవమన్నారు. ఎక్కడికి వెళ్లినా ఆకలి తీర్చే కార్డని చెప్పారు. రేషన్ అనే వ్యవస్థను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ… pic.twitter.com/wleawjVZoH
— BigTV APP (@BigtvApp) August 15, 2026
"మీ బతుకు చెడ… బతుకమ్మ చీరల్లో కూడా కమిషన్ కొట్టి, ఆ పాపానికి కొట్టుకపోయి ఫామ్‌హౌస్‌లో బందీ అయి బతుకుతున్నారు. మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తారా?": CM రేవంత్ pic.twitter.com/BvvnxhYvK7
— BigTV APP (@BigtvApp) August 15, 2026