E-Paper
Advertisement

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!
Advertisement

RS Praveen: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాఖలో కూడా ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏసీబీ అధికారులు కొంచెం ఆలోచించి విధులు నిర్వర్తించాలని సూచించారు. కేటీఆర్ ఇప్పుడు విదేశాలకు వెళ్లి ఎవరినైనా ప్రభావితం చేస్తారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ తో పాటు అందరి పాస్ పోర్టులు వారి వద్దే ఉన్నాయన్నారు.

2023 ఆగస్టు చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఎన్నో హామీలు ప్రకటించిందని ఆర్ఎస్ ప్రవీణ్ గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్న కాంట్రాక్టులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు పనులు ఇవ్వకుండా 5, 6 సబ్ స్టేషన్లను కలిపి టెండర్ పిలిచారన్నారు. వికారాబాద్ ఎస్సీ నియోజకవర్గం, అక్కడి తొమ్మిది సబ్ స్టేషన్లకు కలిపి ఓకే ప్యాకెజీ గా టెండర్ ఇచ్చారన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా కోమటిరెడ్డి పృథ్వీ రెడ్డి పనులు చేస్తున్నారని తెలిపారు.

Advertisement

కేసీఆర్ హయంలో ఇరిగేషన్ శాఖలో బీసీ దళిత గిరిజన కాంట్రాక్టర్లకు రిజర్వేషన్లు కల్పించేందుకు జీవో 29 తెచ్చారన్నారు. అదే అన్నిటికి మదర్ జీవో అయ్యిందని దుయ్యబట్టారు. ఇపుడు ఆ జీవోను భట్టి తన శాఖలో కూడా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. సీఎంఓలో ఒక్క ఎస్సీ, ఎస్టీ అధికారి కూడా లేరన్నారు. విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్టర్లు.. సచివాలయంలో భట్టి ఛాంబర్ ఎదుట ధర్నా చేసే పరిస్థితి వచ్చిందన్నారు.

Also Read: రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Advertisement

కాంగ్రెస్ లో ఉన్న ఎస్సీ నేతలు ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు అవకాశం ఇచ్చి.. ప్యాకేజీ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లు కూడా కమిషన్లు ఇవ్వాలని విద్యుత్ శాఖలోని అధికారులు చెప్తున్నారని.. సబ్ స్టేషన్లకు పిలిచిన టెండర్లు రద్దు చేసే వరకు పోరాడతామన్నారు.

Also Read: పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన.. బలూచ్ మహిళా కమాండోలు.. ఫస్ట్ అటాక్‌లోనే 9 మంది మృతి!

Tags

Related News

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

ఆ ఛాంబర్ ముందు ఆంక్షలు ఎందుకు.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్!

Big Stories

Advertisement
×