E-Paper
Advertisement

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!
Advertisement

POCSO Case: మైనర్ బాలునిపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తికి ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి జిల్లా పోక్సో కేసుల ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. మామిడిపల్లి నివాసి మహ్మద్ మునావర్ హుస్సేన్ (30) అదే ప్రాంతంలోని ఇస్లామియా కాషిఫుల్ ఉలూమ్ మదర్సాలో టీచర్ గా పని చేస్తున్నాడు.

13ఏళ్ల బాలుడు..

కాగా, మదర్సాలో చదువుకుంటున్న 13ఏళ్ల బాలుడు 2024, డిసెంబర్ లో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు జరిపించగా బాధితుడి రహస్య అవయవాల వద్ద తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. బాలున్ని ప్రశ్నించగా మదర్సాలో టీచర్‌గా పనిచేస్తున్న మునావర్ తనను వాహనంపై పహాడీషరీఫ్ రాజీవ్ గాంధీ నగర్‌ లోని మసీద్-ఎ-రహమత్ ఉన్నీసా సమీపంలోని ఒక గదికి తీసుకెళ్లినట్టు చెప్పాడు.

పోలీసులకు ఫిర్యాదు..

Advertisement

అక్కడ లైంగిక దాడికి పాల్పడి ఎవ్వరికీ విషయం చెప్పొద్దని బెదిరించినట్టు తెలిపాడు. ఈ విషయాన్ని బాధితుడి తల్లి తన భర్తకు తెలియజేయగా, ఆయన పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అప్పట్లో డీఐగా ఉన్న జితేందర్ కేసులు నమోదు చేశారు. ఆయన బదిలీపై వెళ్లిన తర్వాత సీఐగా వచ్చిన గురువారెడ్డి విచారణ పూర్తిచేసి కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించారు. కేసును విచారించిన కోర్టు మునావర్ కు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Also read: రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

Tags

Related News

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

ఆ ఛాంబర్ ముందు ఆంక్షలు ఎందుకు.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్!

అదుపుతప్పి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం: కొండా సురేఖ

Big Stories

Advertisement
×